RSPraveen: 'సలహా మండలి'లో చేరను.. సీఎం రేవంత్ కు RS ప్రవీణ్ షాక్

సలహా మండలిలో తాను ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై RS ప్రవీణ్ స్పందించారు. సలహా మండలిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆర్ఎస్పీ అన్నారు. ఆహ్వానం వచ్చినా సలహా మండలిలో చేరేది లేదు అని తేల్చి చెప్పారు.

New Update
RSPraveen: 'సలహా మండలి'లో చేరను.. సీఎం రేవంత్ కు RS ప్రవీణ్ షాక్

RS Praveen Kumar: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. త్వరలో రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేయనున్నట్లు..అందులో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి, ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్‌రావు లకు చోటు ఉంటుందని వస్తున్న వార్తలపై తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. సలహా మండలిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆర్ఎస్పీ (RS PRAVEEN) అన్నారు. ఆహ్వానం వచ్చినా సలహా మండలిలో చేరేది లేదు అని తేల్చి చెప్పారు. తాను జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని.. సలహా మండలిలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు.

ALSO READ: BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ (X) లో.. 'మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం ప్రొ. నాగేశ్వర్, ప్రొ. హరగోపాల్ గార్లతో కూడిన ఒక సలహా మండలిలో నా పేరు కూడా ఉన్నట్లుగా కొన్ని ఛానళ్లలో నిన్నటి నుండి వార్తలు వస్తున్నట్లుగా నాకు తెలిసింది. This is outright fake news. సాధారణంగా ఇలాంటి కమిటీల్లోకి ఎవరిని ఎంపిక చేయాలన్నది ఆయా వ్యక్తులను సంప్రదించిన తరువాతే ఫైనల్ చేయడం ఆనవాయితీ. కానీ ఈ విషయంలో నన్నెవరూ సంప్రదించలేదు. ఒక వేళ సంప్రదించినా నేను ప్రతి పక్షంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి (#BSP) ఈ రాష్ట్రంలో నేతృత్వం వహిస్తూ, బహుజన ఉద్యమ,సామాజిక న్యాయ పితామహులైన ఫూలే-అంబేద్కర్-కాన్షీరాం గార్ల ఆలోచనలను జనంలో తీసుకొని పోయే ఉద్యమంలో తలమునకలై ఉండడం వల్ల ఏ లాంటి ప్రభుత్వ సలహా కమిటీల్లో ఉండే పరిస్థితి లేదు. అత్యవసర స్థితిలో తప్ప అధికారంలో లేని రాజకీయ పార్టీలు ఎప్పుడూ ప్రజల గొంతుకలా ఉండాలే తప్ప, ప్రభుత్వ కమిటీలలో ఉండకూడదు. తెలంగాణలో స్వతంత్రంగా ఆలోచించే మేధావులకు కొరత లేదు. వాళ్ల నే ఈ లాంటి కమిటీల్లోకి తీసుకుంటే బాగుంటదని నా అభిప్రాయం.' అని వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెట్టారు.

ALSO READ: రాక్ష‌స పాల‌న‌లో అమ్మాయిలకు రక్షణ లేదు.. జగన్ పై లోకేష్ ఫైర్

Advertisment
Advertisment
తాజా కథనాలు