'RRR' రీ రిలీజ్.. ఈసారి మరింత స్పెషల్ గా..! 'RRR' సినిమాని మే 10 న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రీ రిలీజ్ ని ఇంకాస్త స్పెషల్ గా మార్చేందుకు మేకర్స్ 2D, 3D ఫార్మట్స్ తో పాటూ 4K వెర్షన్ ని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. By Anil Kumar 07 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి 'RRR' Re-Release : దర్శక దిగ్గజం S S రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2022 లో విడుదలైన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ అద్భుత నటన కనబరిచారు. పాన్ ఇండియా(PAN India) స్థాయిలో రిలీజైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ రూపంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అంతేకాదు ఈ రీ రిలీజ్ ని మరింత స్పెషల్ గా మార్చేందుకు మేకర్స్ కొన్ని సర్ప్రైజ్ లను ప్లాన్ చేశారు. Also Read : ‘దేవర’ షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే? మరింత స్పెషల్ గా రీ రిలీజ్ 'RRR' రిలీజై రెండేళ్లు అవుతున్న ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ మూవీని రీ రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుతున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. మే 10 న ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రీ రిలీజ్ ని ఇంకాస్త స్పెషల్ గా మార్చేందుకు మేకర్స్ 2D, 3D ఫార్మట్స్ తో పాటూ 4K వెర్షన్ ని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో సినీ లవర్స్ 'RRR' రీ రిలీజ్ కోసం ఎంతో ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. RRR RE RELEASE on 10th May 🔥💥 @AlwaysRamCharan #RRRMovie pic.twitter.com/8eaIfLjw14 — Navya (@HoneYNavya_) May 6, 2024 ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ చిత్రం 'RRR' సినిమాకి ఎనో అవార్డ్స్ వచ్చాయి. వాటిల్లో ఆస్కార్ చాలా స్పెషల్. సినిమాలోని 'నాటు నాటు' పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్(Oscar Award) దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ చిత్రంగా 'RRR' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. #ram-charan #ntr #pan-india-movie #rrr-re-release మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి