T20 World Cup : టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) లు జట్టు నుంచి తప్పుకుంటారా అని అడిగితే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ టోర్నీ తర్వాత వీరిద్దరూ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకూ గుడ్‌బాయ్ చెప్పనున్నారని తెలుస్తోంది. అసలు మొన్న జరిగిన వన్డే వరల్డ్‌కప్(One Day World Cup) తర్వాతనే రోహిత్, విరాట్‌లు పెద్దగా ఆడలేదు. టీ20 వరల్డ్‌కప్‌కు కూడా రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనని చెప్పాడు. కానీ అతనిని బీసీసీఐ బలవంతంగా ఒప్పించింది. అందుకే ఇప్పుడు ఇది అయిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని రోహిత్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక విరాట్ కూడా వరల్డ్‌కప్ తర్వాత పెద్దగా ఆడలేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడ్డానికి వచ్చాడు. దీంతో ఈ స్టార్ బ్యాటర్ కూడా టీ20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అయిపోతాడని చెబుతున్నారు.
టీ20 వరల్డ్‌కప్ ఆడనున్న భారత జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో జాబితాను రిలీజ్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. బీసీసీఐ సెక్రటరీ, అజిత్ అగార్కర్‌తో కూడిన సెలక్షన్ ప్యానెల్ వరల్డ్ కప్‌కు ఆడే బారత జట్టు టీమ్‌ను ఎంపిక చేసింది. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ మొదలవనుంది. టీ-20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి మొదలవనుంది. దీనికి అమెరికా, వెస్ట్ ఇండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఇక వరల్డ్ కప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను జూన్5న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఇక గ్రూప్ ఏ లో ఉన్న ఇండియా-పాక్‌లు జూన్ 9న తలపడనున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. అమెరికాలో 3, వెస్ట్ఇండియాలో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీ20 ఆడే భారత జట్టు ఇదే…
రోహిత్ (సి), కోహ్లీ, జైస్వాల్, సూర్య, పంత్ (డబ్ల్యుకె), శాంసన్ (డబ్ల్యుకె), హార్దిక్ (విసి), దుబే, జడేజా, అక్షర్, కుల్దీప్, చాహల్, అర్ష్‌దీప్, బుమ్రా మరియు సిరాజ్.
రిజర్వ్‌లు – శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్, అవేష్ ఖాన్.
Also Read : 100 స్కూళ్లకి పైగా బాంబు బెదిరింపులు.. రష్యా నుంచి మెయిల్స్