IPL 2024 : స్టేడియంలో కొట్టుకున్నది పాండ్యా-రోహిత్‌ ఫ్యాన్స్‌ కాదా?

మోదీ స్టేడియంలో గుజరాత్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ సందర్భంగా గ్యాలరీలో ఫ్యాన్స్‌ కొట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. రోహిత్‌-పాండ్యా ఫ్యాన్స్‌ ఒకరినొకరు తన్నుకున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తన్నుకున్నది ఈ ఇద్దరి ఫ్యాన్స్‌ కాదని INDIA.com ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

IPL 2024 : స్టేడియంలో కొట్టుకున్నది పాండ్యా-రోహిత్‌ ఫ్యాన్స్‌ కాదా?
New Update

FACT CHECK : రోహిత్‌(Rohit) వర్సెస్‌ పాండ్యా(Pandya) విషయంలో క్రికెట్‌ సమాజం రెండుగా చీలిపోయింది. రోహిత్‌ ఫ్యాన్స్‌ అంతా ఒకవైపు.. కోహ్లీ(Kohli)-ధోనీ(Dhoni) ఫ్యాన్స్‌ అంతా పాండ్యాకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇదంతా పాండ్యాపై ప్రేమతో కాదు రోహిత్‌పై అసూయతో ఇలా చేస్తున్నాని హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్ అంటుంటారు. పాండ్యాను ముంబై కెప్టెన్‌గా నియమించడమే ఈ గొడవకు కారణం. గుజరాత్‌(Gujarat) నుంచి ట్రేడ్‌ చేసుకోని మరీ పాండ్యాను ఎందుకు కెప్టెన్‌ చేశారన్నది రోహిత్‌ ఫ్యాన్స్‌ ప్రశ్న. మొత్తానికి జరగాల్సింది జరిగిపోయింది. రోహిత్‌ ఫ్యాన్స్‌ ఎప్పటిలానే ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) కు సపోర్ట్‌గా ఉన్నారు. అయితే నిన్న గుజరాత్‌ మ్యాచ్‌లో స్టేడియంలో రెండు వర్గాల ఫ్యాన్స్‌ కొట్టుకున్నారు. ఇది రోహిత్‌-పాండ్యా ఫ్యాన్సేనని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత?



ఇందులో నిజమెంత?

అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. గుజరాత్‌కు గత రెండు సీజన్లలో పాండ్యా(Pandya) కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో ముంబైకి ట్రేడ్ అయ్యాడు. దీంతో అహ్మదాబాద్‌ క్రౌడ్‌ సైతం పాండ్యా విషయంలో అసంతృప్తిగా ఉంది. ఇది టాస్‌ సమయంలో స్పష్టంగా కనిపించింది. ఫ్యాన్స్‌ రోహిత్‌ రోహిత్‌ అంటూ నినాదాలు చేశారు. ఇక మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో స్టేడియం గ్యాలరీలో కొందరు తన్నుకోగా.. వారు రోహిత్‌(Rohit)-పాండ్యా ఫ్యాన్స్‌ అని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి మీడియా సంస్థ INDIA.com ఫ్యాక్ట్ చెక్ చేసింది. స్టేడియంలో కొట్టుకున్నది రోహిత్‌-పాండ్యా ఫ్యాన్స్ కాదని వారి ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

పాండ్యాను పట్టించుకోని బుమ్రా:

మరోవైపు రోహిత్‌ను పాండ్యా సరిగ్గా ట్రీట్‌ చేయడంలేదన్న వాదన వినిపిస్తోంది. గుజరాత్‌పై మ్యాచ్‌లో రోహిత్ ఫీల్డ్‌ సెట్‌ను పాండ్యా పదేపదే మార్చుతూ కనిపించాడు. ఇక మ్యాచ్‌ మొత్తం ముగిసిన తర్వాత పాండ్యాకు రోహిత్‌ సీరియస్‌గా ఎందుకో క్లాస్‌ పీకుతున్నట్టు వీడియోలో కనిపించింది. అటు బుమ్రా సైతం మ్యాచ్‌ సమయంలో పాండ్యాను పెద్దగా లెక్క చేయకుండా ఎప్పటిలాగే రోహిత్‌ దగ్గరకు వెళ్లాడు. ఇలా ఎంతో కలిసికట్టుగా ఉండే ముంబై ఇండియన్స్‌లో ప్రస్తుతం రెండు వేరు కుంపటులు కనిపిస్తుండడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read : బుద్ధి బయటపడింది.. పాండ్యా వల్లే మ్యాచ్‌ పోయింది.. ఎందుకంటే

#hardik-pandya #cricket #rohit-sharma #ipl-2024 #mumbai-indians
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe