Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై 'నో హిట్‌ శర్మ..' సఫారీ పిచ్‌లపై ఘోరంగా రోహిత్‌ లెక్కలు!

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో రోహిత్‌ శర్మ రికార్డు ఘోరంగా ఉంది. సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 5 పరుగులే చేసి ఔటైన రోహిత్‌ ఇప్పటివరకు సఫారీ గడ్డపై 9 ఇన్నింగ్స్‌లో కేవలం 128రన్సే చేశాడు. యావరేజ్‌ 14.22గా ఉంది.

Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై 'నో హిట్‌ శర్మ..' సఫారీ పిచ్‌లపై ఘోరంగా రోహిత్‌ లెక్కలు!
New Update

టెస్టులు ఆడడం.. వన్డేలు ఆడడం ఒకటి కాదు. స్వదేశీ పిచ్‌లపై ఆడడం.. వీదేశీ గడ్డపై ఆడడం కూడా ఒకటి కాదు. టెస్టుల్లో రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఏమంతా చెప్పుకోదగ్గ ప్లేయర్ కాదు. అతని గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. వన్డేల్లో విదేశీ గడ్డలపై రోహిత్‌కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా సోయిల్‌పై వన్డేల్లో రోహిత్‌ ఎవరికి అందనంతా ఎత్తులో ఉన్నాడు. కానీ టెస్టులకు వచ్చేసరికి మాత్రం ఆ లెవల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ముందునుంచి లేదు. ముఖ్యంగా పేసర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై టెస్టుల్లో రోహిత్‌ ఆట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తాజాగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ రోహిత్‌ విఫలమయ్యాడు.

అదేం షాట్ బ్రో?
సెంచూరియన్‌ వేదికగా మొదలైన తొలి టెస్టులో టాస్‌ ఓడిన ఇండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్‌ శర్మతో పాటు యంగ్‌ గన్‌ యశస్వీ జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. స్టార్టింగ్‌లో రోహిత్‌ ఓ ఫోర్ వేశాడు. ఇంకేముంది.. 'దూకుడు, అటాకింగ్‌, దంచుడు, అది.. ఇది.. ఉమ్‌మ్‌..' అంటూ రోహిత్‌ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో ఎలివేషన్‌ ట్వీట్స్‌ వేశారు. ఆ ట్వీట్స్‌ అలా పోస్ట్‌ అయ్యాయో లేదో ఇలా రోహిత్‌ వికెట్ పారేసుకున్నాడు.

publive-image

రబాడా వేసిన బంతిని రెక్‌లెస్‌గా పుల్‌చేసే ప్రయత్నం చేసిన రోహిత్‌ బర్గర్‌ చేతికి చిక్కాడు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. 14 బంతుల్లో రోహిత్‌ 5 పరుగులే చేశాడు. ఆడుతున్నంతా సేపు కూడా రోహిత్‌ చాలా డల్‌గా కనిపించాడు.


సఫారీ గడ్డపై ఎప్పుడూ అంతే:
టెస్టుల్లో సఫారీ గడ్డపై రోహిత్‌ రికార్డులు తీసికట్టుగా ఉన్నాయి. అక్కడి పిచ్‌లపై హిట్‌మ్యాన్‌ నో హిట్‌మ్యాన్‌గా మిగిలిపోయాడని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడాడు రోహిత్‌. ఇందులో ఒక హాఫ్‌సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కోరు 47. ఈ 9 ఇన్నింగ్స్‌లోని రన్స్‌ను గమనిస్తే 14, 6, 0, 25, 11, 10, 10, 47, 5గా ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 128 రన్సే చేశాడన్నమాట. ఈ లెక్క యావరేజ్‌ చూస్తే అది కేవలం 14.22గానే ఉంది. ప్రస్తుతం రోహిత్‌ వయసు 36. ఇక నెక్ట్స్‌ టైమ్‌ సఫారీ పర్యటకు రోహిత్‌ వచ్చే ఛాన్స్‌ దాదాపు లేదనే అనుకోవాలి. ఈ మ్యాచ్‌లో మరో ఇన్నింగ్స్‌ ఆడే ఛాన్స్‌ రోహిత్‌కు ఉంది. ఇక రెండో టెస్టులోనూ రోహిత్‌ ఆడతాడు. సో ఈ మూడు ఇన్నింగ్స్‌లలో రోహిత్‌ భారీ స్కోరు చేయాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

Also Read: వన్డేల్లో తోపుగాడు.. టెస్టుల్లో తుస్సుగాడు.. కావాలంటే ఈ లెక్కలు చూడండి!

WATCH:

#rohit-sharma #cricket #south-africa #cricket-news #india-vs-south-africa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe