ICC Serious On Rohit Sharma : టెస్టు మ్యాచ్‌లు ఏ దేశంలో జరిగినా ఎలా జరిగినా ప్రతీసారి పిచ్(Pitch) లపై ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. కొన్నేళ్లుగా టెస్టు మ్యాచ్‌లు చాలా తక్కువ రోజుల్లోనే ముగుస్తుండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్(Test Match) జరగడం గగనమైపోయింది. రెండున్నరన్న రోజులు, మూడున్నర రోజులకే మ్యాచ్ ఫలితం వచ్చేస్తుండడంపై క్రికెట్ లవర్స్ చాలా కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇటీవలి దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై భారత్(India) రెండు టెస్టుల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతే కేప్‌టౌన్(Cape Town) వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఒకటిన్నర రోజుల కంటే తక్కువ సమయంలో ముగియడంతో హీట్ డిబెట్‌కు దారి తీసింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐసీసీ(ICC) తో పాటు పాశ్చాత్య మీడియాపై విమర్శలు గుప్పించడం కాక రేపింది. అయితే రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్‌గా ఉందని.. అతనిపై పలు మ్యాచ్‌లు నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసలేం జరిగింది?
నాలుగు-ప్లస్ సెషన్లలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 642 బంతుల్లోనే గేమ్ రిజల్ట్ తేలిపోయింది. ఇంత తక్కువ బంతుల్లో మ్యాచ్ ముగియడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు అతి తక్కువ వ్యవధిలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 656 బంతులకు రిజల్ట్ వచ్చింది. 1932లో మెల్‌బోర్న్(Melbourne) వేదికగా ఆస్ట్రేలియా(Australia) వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ 656 బంతుల్లోనే ముగిసింది. అసాధారణంగా మొదటి రోజే ఏకంగా 23 వికెట్లు కుప్పకూలాయి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లతో దక్షిణాఫ్రికా ప్లేయర్ల పతనాన్ని శాసిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ఫారిన్ మీడియాను తిట్టిపోశాడు. ఇప్పుడిదే అతడిని చిక్కుల్లో పడేసింది.
రోహిత్ ఏం అన్నాడు?
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ పిచ్‌పై వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఎలాంటి పిచ్‌పైనైనా ఆడేందుకు టీమిండియా సిద్ధంగా ఉందని రోహిత్ తెలిపాడు. ఇంతలో పిచ్ రేటింగ్ వెనుక ఉన్న కపటత్వాన్ని బహిర్గతం చేశాడు రోహిత్. విభిన్న పరిస్థితుల్లో ఆడడం సవాల్ అని చెప్పిన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి జట్లు తమ తమ దేశాల్లో ఛాలెంజింగ్ పిచ్‌లను సిద్ధం చేస్తాయన్నాడు. అయితే భారత్ స్పిన్ పిచ్‌లను తయారు చేసినప్పుడు మాత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మీడియా ఛానెల్స్‌తో అతిగా రియాక్ట్ అవుతాయని కామెంట్స్ చేశాడు. ఐసీసీ కూడా భారత్ పిచ్‌లకు పూర్ రేటింగ్ ఇస్తుందని.. అయితే బౌన్సీ ట్రాక్‌లపై త్వరగా ముగిసిన మ్యాచ్‌లను మాత్రం ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వదని వ్యాఖ్యానించాడు. ప్రతీసారి ఇండియా పిచ్‌లనే నిందిస్తుంటారని ఘాటుగా మాట్లాడాడు.
ఐసీసీ సీరియస్:
ఇది ఎమోషనల్ అప్పీల్ అయినప్పటికీ రోహిత్ శర్మ మాటలు ఐసీసీకి ఆగ్రహం తెప్పించాయి. నాయకత్వానికి సంబంధించి ఆయన బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో ఐసీసీ అతడిపై నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే, రోహిత్ శర్మ లేవనెత్తిన ప్రశ్నలను ఐసీసీ పరిష్కరిస్తుందా.. అసలు హిట్‌మ్యాన్ చెప్పిన దాంట్లో తప్పేం ఉందని టీమిండియా ఫ్యాన్స్ ఐసీసీని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిచ్‌లను అంచనా వేయడంలో సమతుల్య విధానాన్ని ఐసీసీ అనుసరిస్తుందా అని టీమిండియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మపై పలు మ్యాచ్‌లు నిషేధం విధిస్తే అది పక్షపాతమే అవుతుందని కుండబద్దలు కొడుతున్నారు.
Also Read: నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే బెంగళూరు సీఈవో క్రైమ్ కథ!
WATCH: