Rohit: ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్ గా అవతరించనున్న హిట్ మ్యాన్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికి 149 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. అఫ్గాన్ తో ఆదివారం జరిగే మ్యాచ్ తో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించనున్నాడు. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీల రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ ఉంది. By srinivas 13 Jan 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ ఇప్పటికే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) తన పేరుమీద లిఖించుకోగా.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గానూ కొనసాగుతున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరూ అందుకోలేని రికార్డుకు చేరువలో ఉన్న రోహిత్ (Rohit Sharma) అఫ్గాన్ తో రెండో టీ20 మ్యాచ్ తో చరిత్ర సృష్టించనున్నాడు. తొలి క్రికెటర్.. ఈమేరకు ఇప్పటివరకు 149 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత సారథి.. అఫ్గానిస్థాన్‌తో జరిగే రెండో టీ20తో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఘనత అందుకోనున్నాడు. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న కుడిచేతి వాటం బ్యాటర్ 2007 సెప్టెంబర్ 19న డర్బన్‌లో ఇంగ్లండ్‌తో తొలి T20 మ్యాచ్ ఆడగా.. ఇప్పటివరకూ 149ల్లో 3853 పరుగులు చేశాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) 134 T20 మ్యాచ్ లతో రెండవ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) (115 మ్యాచ్‌లు) 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ, ధోని రికార్డులు బ్రేక్.. అలాగే T20ల్లో రెండవ లీడింగ్ రన్-గెటర్ అయిన రోహిత్.. కెప్టెన్‌గా T20ల్లో భారతదేశం తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా మారే అవకాశం కూడా ఉంది. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాలంటే అతనికి 44 పరుగులు కావాలి. ప్రస్తుతం భారత్‌కు కెప్టెన్‌గా 52 టీ20ల్లో 1527 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్‌గా 50 టీ20ల్లో కోహ్లీ 1570 పరుగులు చేశాడు. ఇక 2021లో T20 కెప్టెన్‌గా 42 T20లు గెలిచిన MS ధోని (Dhoni) రికార్డును బద్దలు కొట్టడానికి మరో రెండు మ్యాచ్ ల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు 52 T20లకు న్యాయకత్వం వహించగా 40 గెలిచాడు. ఆఫ్గాన్ తో జరగబోయే మిగతా రెండు మ్యాచ్‌లలో గెలిస్తే రోహిత్ ధోని రికార్డును సమం చేస్తాడు. ఇది కూడా చదవండి : India : IPL కు ముందే T20 వరల్డ్ కప్ టీమ్ ఫైనల్ లిస్ట్ రెడీ.. సెలెక్టర్ కామెంట్స్ వైరల్! టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారి లిస్ట్ పరిశీలిస్తే.. మ్యాచ్‌లు- పరుగులు- వికెట్లు 1. రోహిత్ శర్మ ఇండియా 149 -3853- 4 2. పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్ 134- 3438 -20 3. జార్జ్ డాక్రెల్ ఐర్లాండ్ 128 -969- 83 4. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ 124 -2435 -28 5. మార్టిన్ గప్టిల్ న్యూజిలాండ్ 122- 3531-0 6. మహ్మదుల్లా బంగ్లాదేశ్ 121- 2122 -38 7. మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ 119 -2514 -61 8. టిమ్ సౌతీ న్యూజిలాండ్ 118 -294 - 151 9. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ 117 - 2382 - 140 10. డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా 116- 2268 భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం (జనవరి 14) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. మొహాలీలో జనవరి 11న జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. #rohit-sharma #rtvlive-com #cricket-news #rtvtelugu #t20-match #world-record మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి