Rohit: బజ్‌బాల్ గేమ్ పై స్పందించిన రోహిత్.. అదే తలనొప్పిగా మారిందంటూ ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ విధానాన్ని అనుసరించడంపై భారత సారథి రోహిత్ శర్మ స్పందించారు. 'మన ప్రత్యర్థులు ఎలా ఆడుతున్నారనే దానిపై నాకు ఆసక్తి లేదు. మన ఆటను మనం ఆడాల్సిందే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను గెలుస్తామనే నమ్మకం ఉంది' అన్నాడు. By srinivas 24 Jan 2024 in ఇంటర్నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి IND vs ENG: ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో బజ్‌బాల్ గేమ్ ఆడటంపై భారత సారథి రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జనవరి 25న ఈ సిరీస్ మొదలుకానుండగా గురువారం ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రోహిత్ టీమిండియా అన్ని రకాలుగా ఈ సిరీస్ కు సన్నద్ధమైందని చెప్పాడు. 🗣️🗣️ The pressure of Test match is different Hear from #TeamIndia Captain @ImRo45 ahead of the #INDvENG Test Series opener 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/qaq5EtYaOR — BCCI (@BCCI) January 24, 2024 ఆసక్తి లేదు.. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. ‘మన ప్రత్యర్థులు ఎలా ఆడుతున్నారనే దానిపై నాకు ఆసక్తి లేదు. మన ఆటను మనం ఆడాల్సిందే. ఒక జట్టుగా గ్రౌండ్ లో ఎలా ఉంటామనేదే చాలా ఇంపార్టెంట్. బజ్ బాల్ గేమ్ గురించి అసలే ఆలోచించను. మా ఆటగాళ్లంతా ఏడాదిగా నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. టెస్టు మ్యాచ్‌లో ఆడటం ప్రతి ఆటగాడికి సవాల్‌తో కూడుకున్నదే. ఉప్పల్ మైదానంలో ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతాం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను గెలుస్తామనే నమ్మకం ఉంది. ఆ జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు' అన్నాడు. We've named our XI for the first Test in Hyderabad! 🏏 🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket — England Cricket (@englandcricket) January 24, 2024 ఇది కూడా చదవండి: Rohan Bopanna : దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఘనత.. 43 ఏళ్ల వయసులో బోపన్న సంచలనం! చాలా మార్పులు వచ్చాయి.. అలాగే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన ఇచ్చారని, టెస్టు మ్యాచ్‌లో చాలా మార్పులు వచ్చాయని చెప్పాడు. ఇక 20 ఏళ్ల కిందట టెస్టు సిరీస్‌కు.. ఇప్పటికి ఎన్నో మార్పులను చూశామని చెప్పిన సారథి.. స్పిన్నర్లను ఎవరిని ఎంపిక చేయాలనేది తలనొప్పిగా మారిందన్నాడు. ఈ సిరీస్‌లో కుల్‌దీప్ రాణిస్తాడని అనుకుంటున్నా. తొలి రెండు టెస్టుల్లో విరాట్ లేకపోవడం మాకు లోటే. హైదరాబాదీ పేసర్ సిరాజ్ జట్టులో కీలక బౌలర్‌గా మారాడంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక బజ్ బాల్ గేమ్ పై మాట్లాడిన జస్ప్రిత్ బుమ్రా.. ఇంగ్లాండ్ బజ్‌బాల్ ఆటతీరుతో తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేరన్నారు. ప్రత్యర్థి జట్టుకే ఎక్కువ నష్టం కలుగుతుందన్నాడు. #england #test-series #rohit-sarma #bazball మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి