Rohan Bopanna : దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఘనత.. 43 ఏళ్ల వయసులో బోపన్న సంచలనం! భారత ఆటగాడు రోహన్ బొపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. రెండో సీడ్ రోహన్-మాత్యు జోడి మోల్టెని-గోన్సాల జోడిని ఓడించింది. ఈ విజయంతో రోహన్ బొపన్న పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్-1గా నిలిచారు. అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. By Trinath 24 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Australian Open 2024 : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. రోహన్ బోపన్న-మాట్ ఎబ్డెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ-ఫైనల్(Australian Open Semi Final) కు చేరుకున్నారు. 43ఏళ్ల రోహన్ బోపన్న, మాట్ ఎబ్డెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 7-6 (7-5)తో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ విజయం తర్వాత, రోహన్ బోపన్న-మాట్ ఎబ్డెన్ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్-1గా నిలిచారు. #AusOpen MD 2nd seeds 🇮🇳Rohan Bopanna & 🇦🇺Matt Ebden Moves to the SF of a grand slam for the 3rd consecutive time! & it’s 4th SF appearance for Bopanna in his last 5 Slams 😳😱 (except last year French open) Man at the age of 43!!!! 🤯 Since Ram-Salisbury already out 😎👻 pic.twitter.com/qA7ZLq2tNk — Jackson Dass Antony (@AJacksonDass) January 24, 2024 అర్జెంటీనా జోడిపై విజయం: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా(Argentina) కు చెందిన మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెనీలు రోహన్ బోపన్న -మాట్ ఎబ్డెన్‌లతో తలపడ్డారు. రోహన్ బోపన్న, మాట్ ఎబ్డెన్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రెస్ మోల్టెని 6-4, 7-6 (7-5)తో ఓడిపోయారు. అంతకుముందు, రోహన్ బోపన్న - మాట్ జోడి నెదర్లాండ్స్‌కు చెందిన వెస్లీ కూల్‌హాఫ్ క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్ జోడీని వరుస సెట్లలో ఓడించారు. రెండో సీడ్‌లో ఉన్న భారత్-ఆస్ట్రేలియా జోడీ ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ కూల్‌హాఫ్, మెక్టిక్‌పై 7-6 7-6 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-మాట్ ఎబ్డెన్ ద్వయం 6-4, 7-6 (7-5)తో అర్జెంటీనాకు చెందిన మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెని జోడీని ఓడించింది. Also Read: మ్యాచ్‌కు ముస్తాబైన భాగ్యనగరం.. భారత్ తుది జట్టు ఇదే! WATCH: #rohan-bopanna #australian-open-2024 #sports-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి