ORR Accident: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రమాదం.. యువకుడు మృతి!

హైదరాబాద్ నార్సింగ్‌ ఔటర్ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా వాహనదారుడు పరారయ్యాడు. సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ORR Accident: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రమాదం.. యువకుడు మృతి!
New Update

Hit And Run Case In Narsingi - ORR: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ ఇష్యూ మరవకముందే ఔటర్ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి దగ్గరలో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా వాహనదారుడు పరారయ్యాడు.

ఈ మేరకు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్ కు కాల్ చేసి యువకుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారని పోలీసులు తెలిపారు. అలాగే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హిట్ అండ్ రన్‌గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిని ఏ వాహనం ఢీకొట్టిందనే విషయంలో స్థానికంగా అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లభించగానే నిందితుడిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: నాకు అహంకారం లేదు.. అందరినీ కలుస్తా: సీఎం రేవంత్

#hyderabad #orr-accident #crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe