Telangana: నాకు అహంకారం లేదు.. అందరినీ కలుస్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై ఎల్బీ స్టేడియం వేదికగా పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గత పాలకులు సామాన్యులను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. కానీ తాను సీఎం హోదాలో ఉన్నప్పటికీ అందరినీ కలుస్తానని, ఎవరు పిలిచిన పలుకుతానని చెప్పారు. By srinivas 04 Mar 2024 in Latest News In Telugu మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై ఎల్బీ స్టేడియం వేదికగా పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గత పాలకులు సామాన్యులను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. కానీ తాను సీఎం హోదాలో ఉన్నప్పటికీ అందరినీ కలుస్తానని, ఎవరు పిలిచిన పలుకుతానని చెప్పారు. నియామక పత్రాలు జారీ.. ఈ మేరకు తెలంగాణలో చేపట్టిన అధ్యాపక, ఉపాధ్యాయ, మెడికల్, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. నియామక పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు సాధించినవారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిమామక పత్రాలు అందజేశారు. ఇది కూడా చదవండి: BREAKING : మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితా! ప్రజల కళ్లలో ఆనందం చూడాలనే.. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. విద్య మీద పెట్టేదాన్ని ఖర్చుగా చూడకూడదని సూచించారు. గత ప్రభుత్వంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చూశారంటూ మండిపడ్డారు. ప్రజల కళ్లలో ఆనందం చూసేందుకు ఈ మీటింగ్ పెట్టామని, తాను సామాన్య ప్రజానికానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. #lb-stadium #cm-revanth #brs #congress #kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి