Bus Accident : నేషనల్ హైవే పై 44 (National Highway - 44) పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) కి చెందిన ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ మహబూబ్‌నగర్ జడ్చర్ల బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఏపీ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు ఆదివారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయల్దేరింది. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే ఓ డీసీఎం వ్యాన్ యూటర్న్ తీసుకోవడానికి ఒక్కసారిగా మలుపు తిరిగింది.
ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఒక్కసారిగా ఢీకొన్నాయి. బస్సు అదుపు తప్పి కుడివైపు రోడ్డు కిందకి దూసుకుపోయింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్, కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగిలిన ప్రయాణికులు బస్సు అద్దాలు పగలకొట్టుకుని బయటకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసు సిబ్బంది, స్థానికులు గాయపడిన వారిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు.
ఈలోపు బస్సులో మంటలు తీవ్రతరమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.రాత్రి 2.30 గంటల వరకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని 108 సిబ్బంది మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నుంచి బయటకు రాకపోతే అంతా మంటల్లో కాలిపోయేవారని ఆందోళన వ్యక్తమైంది.
Also read: భారీ ప్లాన్ తో వచ్చిన ట్రంప్ నిందితుడు…కారులో భారీగా పేలుడు పదార్థాలు!