Tamil Nadu Road Accident: తమిళనాడులోని తిళ్లవూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు (AP) చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం తిరువళ్లూరు వెళ్లారు. ఆదివారం తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు లారీని ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు.
పూర్తిగా చదవండి..Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
తమిళనాడులోని తిళ్లవూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు రామ్, చేతన్, నితీశ్, యుకేశ్, నితీశ్ వర్మగా గుర్తించారు.
Translate this News: