Shamshabad: పండుగపూట శంషాబాద్ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సంబరాలను తమ కుటుంబంతో జరుపుకునేందుకు సొంత గ్రామానికి వెళ్తున్న వారిని రోడ్డు మరమ్మతుల కోసం తవ్విన గుంత బలితీసుకుంది. ఈ దారుణమైన ఘటన స్థానికులను కలిచివేయగా ఇందుకు సంబంధించిన వివారాలు ఇలా ఉన్నాయి.
కారు ఢీ కొట్టడంతో..
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గున్సిమియాగూడ వద్ద శనివారం ఉదయం వేగంగా వెళ్తున్న స్విప్ట్ కారు (CAR) ఆటో (AUTO) బైక్ (BIKE)ను ఢీ కొట్టింది. దీంతో మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడ్డాయి. దీంతో కారు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ తోపాటు బైక్ పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలవగా వెంటనే స్థానికి ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ లో కారు బోల్తా..
అలాగే ఇదే రోజు కరీనంగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ఇండికా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : Chain Snatcher: లవ్ బర్డ్స్ కాదు.. దంపతులే: చైన్ స్నాచింగ్ లో నయాట్రెండ్