Rishi Sunak: బ్రిటన్‌లో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ శనివారం తన సతీమణి అక్షితా మూర్తితో కలిసి లండన్‌లోని BAPS శ్రీ స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హిందూ మతం (Hinduism) గురించి మాట్లాడారు. నేను ఇప్పుడు హిందువును. మీలాగే నేను ఒకడిని. నా నమ్మకం నుంచి ప్రేరణ, ఓదార్పును పొందాను. పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉంది. మన విశ్వాసం.. మన కర్తవ్యాలను చేయమని చెబుతుంది. నమ్మకంగా చేసినంత కాలం ఫలితాల గురించి చింతించకూడదని బోధిస్తుంది. నా తల్లిదండ్రులు ఇది నాకు నేర్పించారు. నేను అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తూ జీవిస్తున్నాను. ఎదుగుతున్న నా పిల్లలకు కూడా ఇదే అందించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు సేవ చేసేందుకు ధర్మమే నాకు దారి చూపిస్తోందని' అన్నారు.
Also Read: పెళ్ళి మండపంలో ఆత్మాహుతి దాడి.. 18మంది మృతి..19మంది పరిస్థితి విషమం!
హిందూ కమ్యూనిటీలో ఉండే పిల్లలను డాక్టర్, లాయర్, ఆకౌంటెంట్‌గా మాత్రమే కాకుండా వాళ్లని ఉన్నత స్థాయిలో ఎలా పెంచుతానోనని ఓ పూజారి ప్రసంగించిన అనంతరం సునక్.. అక్కడున్న పూజరులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. నా తల్లిదండ్రులు ఒకవేళ ఇక్కడ ఉంటే.. మీరు వాళ్లని నా గురించి అడిగితే.. నేను డాక్టర్, లాయర్ లేదా అకౌంటెంట్ అయితే వాళ్లు ఇష్టపడేవాళ్లమని చెబుతారంటూ సరదాగా అన్నారు. దీంతో అక్కడున్న భక్తులందరూ నవ్వారు.
అంతేకాదు భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంపై కూడా అక్కడున్న భక్తులతో సునక్ మాట్లాడారు. మ్యాచ్‌పై అందరూ సంతోషంగా ఉన్నారా అని అడగగా.. అందరూ చప్పట్లతో స్పందించారు. ఇప్పుడు యూకేలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న తరుణంగా రిఫామ్ యూకే పార్టీకి చెందిన మద్దతుదారుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేయంతో రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం అనంతరం తాజాగా ఆయన హిందూ ఆలయాన్ని సందర్శించారు. అయితే వచ్చే బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలను తెరపడుతుందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు సునాక్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ.. కైర్ స్టర్మర్ నేతృత్వంలో లేబర్ పార్టీ కంటే 20 పాయింట్ల తేడాతో వెనుకంజలో ఉంది. ఈసారి కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి.. లేబర్ పార్టీ గెలుస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఒక సర్వేలో అయితే ఆఖరికి రిషి సునాక్ కూడా తాను పోటీ చేసే స్థానంలో ఓడిపోతారని తెలిపింది.
Also Read: ఇరాన్ ఎన్నికలు.. హైదరాబాద్‌లో బ్యాలెట్ బాక్స్‌లు