Rishab Shetty : దేశం పరువు తీస్తున్నారు.. బాలీవుడ్‌పై కాంతార హీరో సంచలన వ్యాఖ్యలు!
కన్నడ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనను విమర్శిస్తున్నారు. గతంలో అయన నటించిన సినిమాల సన్నివేశాలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Rishab Shetty Sensational Comments On Bollywood Industry : కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) 'కాంతారా' (Kantara) సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలే 70th నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా సత్తాచాటారు. 'కాంతారా' లో ఆయన అద్భుతమైన నటన ఈ అవార్డు వరించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న నాలుగవ వ్యక్తిగా నిలిచారు రిషబ్.
బాలీవుడ్ పై రిషబ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ (Bollywood) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "కొన్ని భారతీయ చిత్రాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారత దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన చిత్రాలను కూడా ప్రపంచ చలనచిత్రోత్సవాలకు ఆహ్వానిస్తారు. రెడ్ కార్పెట్ వేస్తారు. అందుకే దేశం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. నా సినిమాల్లో నా దేశం, రాష్ట్రం, భాష అన్నింటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నను అని అన్నారు రిషబ్ శెట్టి ." ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రిషబ్ ను విమర్శిస్తున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాలు, వాటిలోని సన్నివేశాలను సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Actress Hema: సీఎం సార్ ప్లీజ్ నన్ను కాపాడండి.. సెటిల్‌మెంట్ అంటూ వాళ్లు నా పరువు తీస్తున్నారు! - Rtvlive.com