Vyooham Movie Review: ఇది వ్యూహాత్మకమే.. ఆర్జీవీ వ్యూహం ఎలా ఉందంటే.. 

ఏపీలో రాజకీయాలు ఇప్పటికే హీటెక్కాయి. ఆ వేడిని మరింత పెంచడానికి ఆర్జీవీ తీసిన వ్యూహం ఈరోజు రిలీజ్ అయింది. మరి వైసీపీ శత్రువులే టార్గెట్ గా తీసిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు సినిమాలో ఎలాంటి అంశాలు చూపించారు? ఆర్జీవీ వ్యూహం ఫలిస్తుందా? పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Vyooham Movie Review: ఇది వ్యూహాత్మకమే.. ఆర్జీవీ వ్యూహం ఎలా ఉందంటే.. 
New Update

RGV Vyooham Movie Review: రాజకీయాలు - సినిమాలు రెండూ వేరువేరు అని అనుకోవడానికి లేకుండా పరిస్థితులు మారిపోయాయి. అందులోనూ ఇది ఎన్నికల సీజన్. అటు బ్యాలెట్ పోరుకు సిద్ధం అవుతూనే.. ఇటు పొలిటికల్ మూవీ వార్ కి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు మేకర్స్. వరుసగా పొలిటికల్ సినిమాల హంగామా మొదలైంది. పొలిటికల్ మూవీస్ అనగానే ఎవరో ఒకరిని ఉద్దేశించే ఉంటాయనేది కచ్చితంగా తెలిసిందే. ఇదిగో వివాదాస్పద దర్శకుడు.. ఇంకా చెప్పాలంటే తన విధానంతోనే వివాదాల్ని రగిలించే ఆర్జీవీ (RGV) ఎన్నికల సమరానికి వైసీపీకి రెండు సినిమాలను ఆయుధాలుగా ఇవ్వడానికి రెడీ అయ్యారు. అందులో మొదటిది వ్యూహం. ఇది ఈరోజు అంటే మార్చి 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా వెనుక రాజకీయ వ్యూహం ఎలా ఉంది? సినిమా సాధారణ ప్రేక్షకులకు ఏవిధంగా అనిపిస్తుంది? ఆర్జీవీ వ్యూహం ఫలించిందా? ఈ రివ్యూ లో తెలుసుకుందాం రండి. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ నేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) బయోపిక్ గా ఈ సినిమాని చెబుతూ వచ్చారు. సాధారణంగా బయోపిక్స్ అంటే ఉన్నది ఉన్నట్టుగా తీయడం అనేది జరగని పని. ఎవరి బయోపిక్ చేస్తున్నారో వారిని హైలైట్ చేయడానికి ఎలివేషన్స్ తప్పనిసరిగా ఉంటాయి. సినిమా యాక్టర్ లేదా క్రీడాకారుడు వంటి వారి బయోపిక్స్ అయితే.. వారిని ఎదగనీయకుండా చేసిన అంశాలు.. లేదా వ్యక్తులను విలన్స్ గా చూపిస్తూ సినిమా నడిపించడం ఎక్కువగా జరుగుతుంది. మరి ఇది పొలిటికల్ బయోపిక్ కదా.. సహజంగానే వైసీపీకి శత్రువుగా భావించే టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలను.. ఆ పార్టీనాయకులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. రెండు ఆధిపత్య రాజకీయ పార్టీల మధ్య నలిగిపోతున్న రాష్ట్రం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 

కథేమిటంటే.. 
ఏపీలో వైఎస్సార్ మరణం.. తరువాత జగన్ ఓదార్పు యాత్ర కాలం నుంచి సినిమా మొదలవుతుంది. ఈ సమయంలో సీబీఎన్ (Chandrababu), పీకే (Pawan Kalyan) పాత్రలు జగన్ ను ఎలా అప్రతిష్ట పాలు చేయాలని అనుకున్నారు? వారి కుయుక్తులను ఛేదించి ఏపీ ముఖ్యమంత్రిగా ఎలా జగన్ నిలబడగలిగారు అనేది సినిమా కథ. వైఎస్సార్ మరణానంతరం రెండు రాజకీయ వర్గాలకు చెందిన కీలక వ్యక్తుల కథగా ఇది ఉంటుంది. ఒకవైపు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు.. రెండో వైపు తండ్రి ఆశయాల సాధనే ధ్యేయంగా సాగే యువనాయకుడు వీరి మధ్యలో జరిగే రాజకీయ సంఘర్షణ చూపిస్తూనే.. మధ్యలో పీకే ని కామెడీ కోసం వాడుకుంటూ.. పీకే లోపాలను ఎత్తి చూపించే విధంగా సినిమా కథ సాగిపోతుంది. 

Also Read: దేశభక్తి నేపధ్యంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్.. ఆపరేషన్ వాలెంటైన్ 

ఎలా ఉందంటే.. 
రాజకీయాలతో ముడిపడిన సినిమా కాబట్టి సినిమా ఎలా ఉంది అని చెప్పడం కష్టమే. ఎందుకంటే, సినిమాలో సాధారణ వ్యక్తులకు సంబంధించిన అంశాలు ఏమీ లేవు. పూర్తిగా రాజకీయ పరమైన సినిమా. ఇది వైసీపీ వర్గీయులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జగన్ ను హీరోగా భావించే వర్గాలకు ఈ సినిమా మరింత నచ్చుతుంది. అటూ ఇటూ ఊగిసలాడే వారిలో కొందరిని ఈ సినిమాలో కొన్ని అంశాలు ఆకర్షించవచ్చు. పీకే పాత్ర వచ్చినపుడు కామెడీగా సన్నివేశాలు ఉండడం.. CBN, జగన్, భారతి, చిరు (Chiranjeevi) వంటి క్యారెక్టర్లు నిజంగా ఎలా ఉంటాయో అదేవిధంగా కనిపించడం.. బీజీఎమ్.. వంటివి వారిని ఆకట్టుకునే అవకాశం ఉంది. 

కొన్ని చోట్ల అతిగా అనిపించినా.. ఇది పొలిటికల్ బయోపిక్ కాబట్టి కచ్చితంగా వైసీపీ వర్గాలకు అది అద్భుతంగా కనిపించవచ్చు. ఇక ఎంతవరకూ ఈ సినిమాలో నిజాలు చెప్పారు అనేదాని గురించి పెద్దగా చర్చించుకొనవసరం లేదు. ఎందుకంటే, కచ్చితంగా అవతలివారిని టార్గెట్ చేసినపుడు ఇవతలి వారు కొంత ఎక్కువగానే ఏది పడితే అది చెప్పే అవకాశమూ ఉంటుంది. కానీ, ఇది పూర్తిగా సమకాలీన రాజకీయ చిత్రం కావడంతో ఎక్కడైనా అతిగా కనిపించే సన్నివేశాలకు సాధారణ ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం. 

ఎవరెలా చేశారంటే.. 
సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఆయా పాత్రల్లో సరిగ్గా ఇమిడిపోయారు. అసలు సినిమా అంతా అక్కడే ఉంది. ఆర్జీవీ నటీనటుల ఎంపికలోనే మేజిక్ చేశారని చెప్పవచ్చు. ఒరిజినల్ వ్యక్తులను చూసినట్టే.. ఒరిజినల్ గా నే అందరు నటులు కనిపిస్తారు. ఆ మేరకే అందరూ నటించారు.

మొత్తమ్మీద వ్యూహం అనేది కచ్చితంగా ఆర్జీవీ వ్యూహాత్మకంగా తీసిన రాజకీయ చిత్రం కాబట్టి.. ఇందులో లోపాలు.. చప్పట్లు కొట్టే అంశాలు.. ఇలాంటి వాటిగురించి చెప్పుకోలేం. కానీ, ఒక సాధారణ ప్రేక్షకుడు సినిమా చూడటానికి వెళితే.. ఇది పొలిటికల్ సినిమా కాదు.. మామూలు సినిమా అని చూస్తే కనుక.. సినిమా ఫర్వాలేదు అనిపించేలా ఉంటుంది. అయితే, ముందే చెప్పినట్టు ఇది పూర్తిగా పొలిటికల్ మూవీ కాబట్టి.. ఇందులో ఏ పాత్ర కూడా ఇన్ డైరెక్ట్ గా కనిపించాడు కాబట్టి.. సాధారణ ప్రేక్షకుడు అలా సినిమాని చూడటం చాలా కష్టమని చెప్పవచ్చు. పొలిటికల్ సినిమాలు చూడటం ఇష్టమైన వారికి.. వైసీపీ అభిమానులకు మాత్రం ఆర్జీవీ మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. 

ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇవ్వడమూ కష్టమే. అయినా.. ఒక సాధారణ ప్రేక్షకుడిలా సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే.. 2.5/5 రేటింగ్ ఇవ్వవచ్చు. 

సినిమా టీమ్ ఇదే.. 

రచయితలు RGV - ఇతరులు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
DOP సజీష్ రాజేంద్రన్
సంగీతం ఆనంద్
నిర్మాత దాసరి కిరణ్ కుమార్
నటీనటులు  అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ నిరోషా, వాసు ఇంటూరి, కోట జయరామ్, ఎలీనా తుతేజా

ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడొచ్చు.. 

#pawan-kalyan #chandrababu #cm-jagan #movie-review #new-telugu-movies #rgv-vyooham #vyooham-movie-review
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe