TS Government : బీఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ షాక్.. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు! బీఆర్ఎస్ తమ పార్టీ ఆఫీసులో 'T న్యూస్' ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తుందనే కాంగ్రెస్ ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాలని, అలాగే ఎప్పటిలోగా ఛానల్ షిప్ట్ చేస్తారో స్పష్టతనివ్వాలంటూ నోటీసులు పంపించారు. By srinivas 04 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Revanth Sarkar Shock To BRS : తెలంగాణ కాంగ్రెస్(T Congress) గవర్నమెంట్ బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే కేసీఆర్ (KCR) ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందంటూ ఆరోపిస్తున్న రేవంత్(Revanth) సర్కార్ ఒక్కొక్క అంశంపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా ప్రగతిభవన్, సచివాలయం విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా పార్టీ ఆఫీసులో న్యూస్ ఛానల్ పేరిగా బీఆర్ఎస్ వ్యాపారం చేస్తోందని ఆరోపించింది. దీంతో వెంటనే ఆ కార్యాలయం నుంచి ఛానల్ తొలగించాలంటూ రెవెన్యూ(Revenue) అధికారులు నోటీసులు పంపించారు. ఇది కూడా చదవండి : YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే! ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో 'T న్యూస్'(T News) ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తుందనే కాంగ్రెస్ ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో టీ న్యూస్ ఛానల్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ఆపివేయాలంటూ నోటీసులు పంపించారు. అంతేకాదు ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ ఇంచార్జిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాలని, ఎప్పటిలోగా మారుస్తారో స్పష్టత నివ్వాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక బీఆర్ఎస్ యాజమాన్యం 2011 నుంచి టీ న్యూస్ ఛానల్ ను BRS భవన్ లోనే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. #brs #congress #revenue-department #telangana-bhavan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి