CM Revanth Reddy : ఆప్‌కీ ఆదాలత్‌లో ఓటర్లకు సలహా ఇచ్చిన తెలంగాణ సీఎం.. వీడియో వైరల్

మొదటిసారి ఓటు వేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆప్‌కీ అదాలత్‌లో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

New Update
CM Revanth Reddy : ఆప్‌కీ ఆదాలత్‌లో ఓటర్లకు సలహా ఇచ్చిన తెలంగాణ సీఎం.. వీడియో వైరల్

Telangana : ఇండియా టీవీలో ప్రసారమయ్యే ప్రముఖ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్‌’(AAP Ki Adalat) లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఇండియా టీవీ చైర్మన్, ఎడిటర్-ఇన్-చీఫ్ రజత్ శర్మ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షోలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలు, కేసీఆర్‌(KCR) తో రాజకీయ వైరం లాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. దీంతో పాటూ కొత్త ఓటు వేస్తున్న ఓటర్లకు కూడా ముఖ్య సలహా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

యువతకు రేవంత్ రెడ్డి సలహా..
రేవంత్ రెడ్డితో నిర్వహించిన ఆప్‌ కీ ఆదాలత్ షోలో ప్రేక్షకులకు, సీఎం కు మధ్య పెద్ద చర్చనే నడిచింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రేక్షకులుగా కూర్చున్న వారితో మాట్లాడుతూ మొత్తం దేశంలో ఉన్న యువతకు సలహాలు, సూచనలు ఇచ్చారు. బాధ్యతగా ఉండాలని అంటూ కొంచెం గట్టిగానే హెచ్చరించారు. అసలేం జరిగిందంటే.. ఆప్‌ కీ అదాలత్‌కు వచ్చిన ప్రేక్షకులలో ఒక యువకుడు తాను మోదీకే ఓటువేస్తానని ఓపెన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పారు. దీని మీద రేవంత్ స్పందిస్తూ... దేశ యువత జాగ్రత్తగా ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దేశ పరిస్థితులు, నాయకులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు లాంటి విషయాలన్నింటినీ పరిశీలించి మరీ ఓటు వేయాలని సలహా ఇచ్చారు. మీరు ఓటు ఎవరికి వేయాలన్నది పూర్తిగా మీ ఇష్టం. కానీ వేసే ముందు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి... మీ ఓటు మీ కుటుంబం మీద అదనంగా 100 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

మోదీపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి...
ఇక ఓటు గురించి మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ(PM Modi) పైనా విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి. మోదీ ప్రధాని కాక ముందు ఉన్న 14 మంది ప్రధానులు దేశ అభివృద్ధి కోసం 67 ఏళ్ళల్లో 65 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే... మోదీ మాత్రం 10 ఏళ్ళల్లో 113 కోట్ల రుణాలు తీసుకున్నారని విమర్శించారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఎవరి జేబుతోకి వెళ్ళిపోయింది? దేశం కోసం మోదీ ఏం చేశారో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. ఇదంతా దేశ యువత తెలుసుకోవాలి... దాని గురించి ప్రశ్నించాలి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పైపైన కనిపిస్తున్న దాన్ని చూసి ఓటు వేసేయడం కాదు యువత చేయాల్సింది.. బాధ్యతగా వ్యవహరించడం అంటూ సలహాలు ఇచ్చారు. అబ్ కీ బార్, 400 పార్ అనే నినాదాన్ని వినిపించినా, ప్రధాని మోదీ ఈసారి గరిష్టంగా 214 నుంచి 240 లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలరని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు.

Also Read : Iran Vs Israel: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు..వేడెక్కెతున్న ప్రపంచం

Advertisment
తాజా కథనాలు