N Convention: చెప్పిందే చేశాడు.. 7ఏళ్ల క్రితం నాగార్జున కబ్జాలపై రేవంత్ ఏమన్నాడంటే!

2016లో నాగార్జున N కన్వెన్షన్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ చెప్పిందే ఇప్పుడు అధికారంలో చేసి చూపిస్తున్నారు. ఇంకా రేవంత్ అప్పుడేం చెప్పారు? నెక్ట్స్ టార్గెట్ ఎవరు? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

N Convention: చెప్పిందే చేశాడు.. 7ఏళ్ల క్రితం నాగార్జున కబ్జాలపై రేవంత్ ఏమన్నాడంటే!
New Update

CM Revanth: అది 2016 డిసెంబర్ 17.. నాడు రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నారు. అప్పట్లో నిజాంపేట్‌లోని ఓ అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. ఈ విషయంపై స్పందించిన రేవంత్‌ నాడు నాగార్జునను టార్గెట్‌ చేశారు. N కన్వెన్షన్‌ లక్ష్యంగా విమర్శల దాడులు చేశారు. పేదల ఇండ్లు కాదు బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే బడాబాబుల అక్రమ కట్టడాలను కూల్చాలని సవాలు విసిరారు. సీన్‌ కట్ చేస్తే.. 2024 ఆగస్టు 24, N కన్వెన్షన్‌ కూలిపోయింది. స్వయంగా రేవంతే ఆ ఫంక్షన్ హాల్‌ను కూల్చి వేయించారు. కొన్ని కోట్ల విలువైన ఈ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు? బడాబాబులకు మూడినట్లేనా? ఆనాడు రేవంత్ చెప్పింది ఇప్పుడు అమలు చేస్తున్నారా? భూ కబ్జాలపై రేవంత్ అప్పుడు ఏం చెప్పారో తెలుసుకుందాం.

కేటీఆర్‌తో నాగార్జునకు దగ్గరి సంబంధాలు..
అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్ కేంద్రంగా కబ్జాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే నిజాంపేటలోని కొన్ని పేదల ఇళ్లను కూల్చింది. అయితే దీనిపై అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేటీఆర్, హరీష్ రావును స్వయంగా కబ్జాల గురించి ప్రశ్నించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సినీ ప్రముఖులు కబ్జాలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో ముఖ్యంగా అక్కినేని నాగార్జున తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ నిర్మించారని, దీనిపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ నిలదీశారు. దీంతో నాగార్జున కట్టడంపై చర్యలు చేపడతామని చెప్పిన హరీష్ రావు.. కొన్ని రోజలకే మౌనంగా ఉండటంపై రేవంత్ సీరియస్ అయ్యారు. కేటీఆర్ తో నాగార్జునకు దగ్గరి సంబంధాలున్నాయని, ఆ అక్రమ కట్టడాన్ని కూలుస్తామని చెప్పి చేతులు మారగానే మొహం చాటేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

హీరోలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..
ఈ మేరకు రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగార్జునతో టీఆర్ఎస్ నాయకులకు ఏమైనా సంబంధాలున్నాయా? పేదల ఇళ్లు కూలగొడుతున్న వాళ్లకు ఇది కనిపించట్లేదా. శాసనసభలో చర్చకు వచ్చిన పట్టించుకోవట్లేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎవరూ సమాధానం చెప్పలేదు. హరీష్, కేటీఆర్ ఇద్దరు ఒకరిపై ఒకరు చెప్పుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. హరీష్ రావు ఆ శాఖకు బాధ్యుడిగా ఉండి కేటీఆర్ పై నెట్టివేశారు. కేటీఆర్ ను ఇరికించేందుకు ఇదే సమయంగా భావించారని రేవంత్ అన్నారు. అలాగే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన హీరోలు తప్పుడు పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. హీరో హీరోలా కాకుండా అక్రమార్కుడిగా ఉంటూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని, చేతులు మారిన తర్వాతే నాగార్జునపై బీఆర్ఎస్ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ వైఖరిపై అనుమానాలున్నాయి. కేటీఆర్ అండతోనే ఎన్ కన్వెన్‌షన్ నడుస్తోంది. దానిని కేటీఆర్ కాపాడుతున్నారు. హరీష్‌ మాటలు చూస్తే అదే అనుమానం వ్యక్తమవుతోందన్నారు రేవంత్ బలమైన ఆరోపణలు చేశారు.

అక్రమార్కుల గుండెల్లో దడ..
నాగార్జున చెరువును ఆక్రమించాడనేది వాస్తవం. మేము దానిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై మేము కోర్టుకు వెళ్లడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా నాగార్జునపై టీఆర్ఎస్ ప్రత్యేక అభిమానం చూపిస్తోంది. చెరువులో మట్టి నింపి వ్యాపారం చేస్తే ఇటుక కూడా తీసే సాహసం చేయలేదు. పేదోళ్ల ఇళ్లను జేసీబీలతో తొలగిస్తుంటే నాగార్జున అక్రమ కట్టడం  కనిపించట్లేదా. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మిగతా చెరువులలాగే ఈ చెరువును కూడా కాపాడాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణకు చెరువులే వరప్రదాయిని అన్నారు రేవంత్.

అయితే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ అప్పుడు తాను చెప్పిందే చేస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. బడా బాబులపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి.. నాగార్జునతోనే మొదలైందని, మరి కొందరు సినితారల కట్టడాలు కూల్చబోతున్నట్లు హింట్ ఇస్తున్నారు. అంతేకాదు రాజకీయ నాయకులకు సంబంధించిన అక్రమ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్.

#cm-revanth #akkineni-nagarjuna #hydra #n-convention
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe