Tollywood Vs Reventh Reddy| తాట తీస్తాం | Konda Surekha | RTV
“బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చేశాము. పేద, మధ్యతరగతికి చెందిన కట్టడాలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం లేదు. అటువంటి నిర్మాణాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.” అంటూ హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
N-కన్వెన్షన్ కూల్చివేతపై నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. దీనిపై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయన్నారు. 'న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని ప్రజలను సవినయంగా అభ్యర్ధిస్తున్నా' అన్నారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 గంటల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ లేదన్నారు.
2016లో నాగార్జున N కన్వెన్షన్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ చెప్పిందే ఇప్పుడు అధికారంలో చేసి చూపిస్తున్నారు. ఇంకా రేవంత్ అప్పుడేం చెప్పారు? నెక్ట్స్ టార్గెట్ ఎవరు? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు.' కూల్చివేత చేపట్టడం బాధాకరం. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. అది పట్టా భూమి. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం' అంటూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
హీరో నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయంగా కనిపిస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించారని 'జనం కోసం' అనే సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో రేవంత్ సర్కార్ దీనిపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది.