బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇవాళ గుళ్ళు చుట్టూ ప్రదక్షినలు చేసేస్తున్నారు. నిన్నటి వరకూ ప్రచారాలతో తాము చేయవలసింది అయిపోయింది. ప్రచారాల్లో ప్రజలకు ఎంత చెప్పుకోవాలో చెప్పుకున్నారు. ఇంక దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని అంటూ ప్రార్ధనలు చేసేస్తున్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్షీ ఆలయాన్ని సందర్శించారు. దాని తరువాత బిర్లా టెంపుల్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటూ ఇంఛార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్ ,మల్లు రవిలుకూడా శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు. వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి మరీ పూజలు చేశారు రేవంత్ రెడ్డి. బిర్లా మందిర్ నుంచి నేరుగా నాంపల్లి దర్గాను కు వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి. దర్గాలో కూడా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
Also read:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు