CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ (Hyderabad)లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. అయితే, రేవంత్ ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా తొలి సంతకం 'ఆరు గ్యారంటీలు'పైనే పెడతారని సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యత వాటిపైనే సీఎం రేవంత్ తొలి సంతకం పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:
బేగంపోర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన కొత్త సీఎం.. ప్రమాణ స్వీకారానికి కౌంట్‌డౌన్!
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రభుత్వ పరంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అలాగే, కాంగ్రెస్ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పలు రాజకీయ పార్టీ అధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానాలు అందుకున్న వారిలో ఏపీ, తమిళనాడు, బీహార్, పశ్చిమబెంగాల్ సీఎంలు, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సహా పలువురు ఉన్నారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!