CM Revanth Lands at Begumpet Airport : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్‌కు తొలి విజయాన్ని అందించిన ఫైర్‌బ్రాండ్ అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఈరోజు(డిసెంబర్ 7) హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పంపారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర ఏఐసీసీ నాయకులను ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. అలాగే పలువురు సీఎంలు, మాజీ సీఎంలు, సినీ ప్రముఖులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy : బేగంపోర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన కొత్త సీఎం.. ప్రమాణ స్వీకారానికి కౌంట్‌డౌన్!
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మ.1:04 గంటలకు LB స్టేడియంలోగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ఇప్పటికే హైదరాబాద్ బెగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రేవంత్.. అక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్లారు.
Translate this News: