గెలుపు జోష్ లో ఉన్న కాంగ్రెస్ లో పరిణామాలు తొందర తొందరగా మారిపోతున్నాయి. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పదవిలోకి రావాలని కాంగ్రెస్ తొందరపడుతోంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, ముఖ్యమంత్రి ఎవరు అన్న అనుమానాలు రావడం లాంటివి ఎందుకు అనుకున్నారో ఏమో రేపే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ రాత్రికే సీఎల్పీ భేటీ జరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డే ముక్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఎల్బీనగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగుతుందని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తాజ్ కృష్ణకు చేరుకున్నారు.
Also Read:కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా.. ఫలితాలపై రేవంత్ రెడ్డి ట్వీట్
మరోవైపు ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. కాన్వాయ్ లేకుండానే ప్రగతి భవన్ నుంచి రాజ్‌భవన్‌కు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. రెండు కార్లలోనే వెళ్లిన కేసీఆర్.. గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.