BIG NEWS: ఆరోజు నుంచే ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్

మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఫ్రీ కరెంట్, రూ.500లకే సిలిండర్‌ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశించారు.

New Update
BIG NEWS: ఆరోజు నుంచే ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్

Two Guarantees : తెలంగాణ(Telangana) లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండో రోజే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ(6 Guarantees) ల్లో రెండు గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద ఆర్టీసీ బస్సు(RTC Bus) లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అలాగే మరో గ్యారెంటీ ఆరోగ్యశ్రీ కార్డు(Arogyasri Card) పరిమితి పెంపు వంటి పథకాలను అమల్లోకి తెచ్చిన రేవంత్ సర్కార్ తాజాగా మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్‌, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీంలు అమలుపై కార్యాచరణ చేపట్టింది.

ALSO READ : గొర్రెల పంపిణీలో స్కాం.. నలుగురు అధికారులు అరెస్ట్!

ఈ నెల 27న అమలు?

రూ.500లకే గ్యాస్ సిలిండర్‌, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీంలు అమలుపై కార్యాచరణ చేపట్టింది. ఈ నెల 27 లేదా 29 నుంచి రెండు పథకాలను ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రూ.500లకే సిలిండర్ ఇస్తే అనుసరించాల్సిన విధానంపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సబ్సిడీ అందించే విధానంపై కేబినెట్‌ సబ్‌కమిటీతో చర్చలు జరిపారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులోని అర్హులందరికీ ఫ్రీ సిలిండర్ ఇవ్వాలని..అలాగే ఫ్రీ పవర్ స్కీంలో భాగంగా లబ్ధిదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వారం రోజుల్లో మెగా డీఎస్సీ..

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications) ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. 

ALSO READ : కరెంట్ కట్ చేస్తే ఉద్యోగాలు ఫట్.. సీఎం రేవంత్ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు