TPCC President Revanth Reddy: గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనన్నారు. రీడిజైన్ పేరుతో కేసీఆర్ ప్రాజెక్టుల స్వరూపం పూర్తిగా మార్చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మేనేజ్‌మెంట్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని రేవంత్ గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదు.. డిజైన్ ప్రకారం నిర్మాణం లేదు, నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదని రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ కుంగింది.. కేసీఆర్ పాపం పండిందన్నారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్.. ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌ను బీజేపీ కాపాడుతోంది
ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై నోరు మెదపలేదని రేవంత్ మండిపడ్డారు. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందని విమర్శించారు. వేల కోట్లు నష్టం జరిగినా కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు అదేశించడంలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను -బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది.. అందుకే బీఆర్‌ఎస్‌ను బీజేపీ కాపాడుతోందని రేవంత్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివేదిక విడుదల చేయడంలేదు? , ప్రాజెక్టులో లోపాలపై సీఎం ఎందుకు వివరణ ఇవ్వడం లేదు..?, ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు..?, సంబంధింత కంపెనీపై ఎందుకు విచారణకు ఆదేశించాలని చెప్పడం లేదు..? అని రేవంత్ ప్రశ్నించారు.
ప్రాజెక్టులను పరిశీలించడం లేదనిఫైర్
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇతర రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో ఒక కమిటీ వేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ ఉండాలని.. సంపూర్ణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు హరీష్‌రావు, కేసీఆర్‌ను పదవుల నుంచి తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ దీనిపై స్పందించాలన్నారు. ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు..కానీ ప్రాజెక్టులను పరిశీలించడం లేదనిఫైర్ అయ్యారు. తక్షణమే మోదీ మేడిగడ్డను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జరిగిన లోపాలపై విచారణ చేపట్టాలని ప్రతిపక్షంగా కేంద్రాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం అన్నారు. అధికారంలోకి వచ్చాక మేం ఏం చేస్తామనేది అప్పుడు చెబుతాం కోదండరాంను తెలంగాణ వ్యతిరేకి అంటే.. తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఇది దొరల..ప్రజల తెలంగాణ మధ్య సంగ్రామం: భట్టి విక్రమార్క