Telangana: వాళ్లకు రుణమాఫీ బంద్.. రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం !

రుణమాఫీపై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్‌ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా.

New Update
Runa Mafi: రెండో విడత రుణమాఫీ అప్పుడే చేస్తాం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!

రుణమాఫీపై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్‌ చేసే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ నిలిపివేయాలని డిమాండ్లు వచ్చాయి. అయితే ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.10 వేల కోట్లు సిద్ధం చేశారు. భూములు తనఖా, రుణాల రూపంలో మరో 20 వేల కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించారు.

Also read: అప్పులకుప్పలో ఏపీ.. బడ్జెట్‌ ఎప్పుడంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు