Uttarakhand: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదం.. సాయంత్రం నాటికి కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్..

ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలి ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ట్రయల్ రన్‌ నిర్వహించారు . అయితే ఆ కార్మికులను బయటకు తీసుకురావడానికి పైపు ద్వారా ఓ స్ట్రెచర్‌ను లోపలికి పంపి దానినుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదం.. సాయంత్రం నాటికి కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్..
New Update

ఇటీవల రెండువారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కార్మికులు ఇంతవరకు బయటకు రాలేదు. సహాయక సిబ్బంది ఇంకా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అయితే గురువారం రాత్రికి వారిని బయటికి తీసుకురావాల్సింది ఉంది. కానీ ఆఖరి నిమిషంలో పనులకు కొంత ఆటంకం జరిగింది. దీంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేటట్లు కనిపిస్తోంది. కార్మికులను పైపు ద్వారా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సక్సెస్‌ఫుల్‌గా ట్రయల్‌రన్‌ను నిర్వహించాయి. ఇందులో భాగంగామే 800 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్న పైపులో గుండా చక్రాలు ఉన్న స్ట్రెచర్‌ను లోపలికి పంపిస్తారు. అయితే పైపుకు అవతలి వైపు ఉన్న కార్మికులు దానిపై బోర్లా పడుకుంటారు. ఆ తర్వాత దాన్ని బయటకు లాగుతారు. వారిని బయటకు తీసుకొచ్చాక నేరుగా ఆసుపత్రికి తరలిస్తారు.

Also Read: గత 25 ఏళ్లుగా అలాంటి పనులు చేయట్లేదు.. సల్మాన్‌ కామెంట్స్ వైరల్

ఇదిలాఉండగా.. లోపల ఉన్న కార్మికులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు లూడో, చెస్‌ వంటి బోర్డు గేమ్స్‌ అందివ్వనున్నట్లు సహాయక బృందంలో మానసిక వ1 వైద్యుడు డాక్టరి రోహిత్ గోండ్వాల్ పేర్కొన్నారుయ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు శారీరక, మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రసుతం లోపల చిక్కకున్నవారందరూ బాగానే ఉన్నారని.. ఒత్తిడిని అధిగమించేందుకు వారు యోగా చేస్తున్నట్లు మాతో చెప్పారని రోహిత్ తెలిపారు. అలాగే వారికి మరికొన్ని బోర్డ్‌ గేమ్స్ కూడా ఆడిస్తామని తెలిపారు.

Also Read: కారులో మంటలు.. కట్ చేస్తే నోట్ల కట్టలు.. ఆ పైసలు ఏ పార్టీవి?

#telugu-news #national-news #uttarkhand #tunnel-collapse
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe