Shamshabad Airport : నాలుగు రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad) లోని శంషాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే మీద ఒక చిరుత(Cheetah) కనిపించింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు హైల అలర్ట్ ప్రకటించారు. అప్పటి నుంచి చురుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొత్తం 9 టరాప్ కెమెరాలతో పాటూ ఒక బోన్‌ను ఏర్పాటు చేశారు. రోజూ ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజు క్రితం షాద్‌నగర్‌లోనూ చిరుత కనిపించింది. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి ఉంటుందని అదికారులు భావిస్తున్నారు. ఈ చిరుతతో పాటూ రెండు పిల్లలు కూడా సంచరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మొదటిసారి ఎయిర్ పోర్ట్ ప్రహారీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత కాలు తగలడంతో అలారం మోడింది. అప్పుడు గమనించగా చిరుత తిరుగుతున్నట్టుగా తెలిసింది.
ఇంకా కొనసాగుతున్న వేట..
అయితే నాలుగు రోజులుగా చిరుత ఎయిర్ పోర్ట్ సిబ్బంది(Airport Staff) కి చిక్కడమే లేదు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అది మాత్రం తప్పించుకుంటోంది. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు చిరుతను పట్టుకోవడానికి బోనులో మేకను ఎరగా కూడా వేశారు. అయితే అది మాత్రం చాలా తెలివిగా బోను వరకు వస్తోంది కానీ అందులోకి దూరడం లేదు. మేకను చూసి కూడా లోపలికి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకే ప్రాంతంలో తిరుగుతోంది కానీ ట్రాప్‌కుమాత్రం చిక్కడం లేదు. నాలుగు రోజులుగా దీన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు శ్రమిస్తూనే ఉన్నాయి.
Also Read:Delhi: నాలుగు కాదు యాభై స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..తనిఖీలు చేస్తున్న పోలీసులు