Renu Desai : నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు, నేనే వాళ్ళను డబ్బులు అడిగా.. వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్!

రేణు దేశాయ్ తన ఇన్ స్టా లో ఓ క్యూ ఆర్ కోడ్ షేర్ చేసి విరాళాలు కావాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ క్యూ ఆర్ కోడ్ ని చూసిన ఆమె ఫాలోవర్స్ ఆమె అకౌంట్ ని హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ ఓ వీడియోని పంచుకుంది.

New Update
Pawan Kalyan: పవన్‌ గెలుపు పై స్పందించిన రేణు!

Actress Renu Desai Instagram Post Viral : రేణు దేశాయ్ సోషల్ మీడియా(Social Media) లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడు తన పర్సనల్ విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా రేణు దేశాయ్(Renu Desai) తన ఇన్ స్టాగ్రామ్(Instagram) లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రతీసారి డబ్బు ఇవ్వలేను

రేణు దేశాయ్ తన ఇన్ స్టా లో ఓ క్యూ ఆర్ కోడ్(QR Code) షేర్ చేసి విరాళాలు కావాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే విరాళాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. నా వంతుగా నేను సాయం చేస్తున్నప్పటికీ మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్ ని అడిగానని, ప్రతీసారి నేను డబ్బులు ఇవ్వలేనని, ఎందుకంటే నా దగ్గర కొన్ని డబ్బులు మాత్రమే మిగిలున్నాయని పేర్కొంది.

అయితే రేణు దేశాయ్ షేర్ చేసిన క్యూ ఆర్ కోడ్ ని చూసిన ఆమె ఫాలోవర్స్ ఆమె అకౌంట్ ని హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ ఓ వీడియోని పంచుకుంది.

Also Read : నటుడు రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా? చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

నా అకౌంట్ హ్యాక్ చేయలేదు

తాజా వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.." ఫుడ్ పాయిజన్ వల్ల నా హెల్త్ బాలేకపోవడంతో వీడియో చేయలేదు. రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్ ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను రెగ్యులర్ గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ నాకు లిమిట్ ఉంటుంది. డొనేషన్స్ కే డబ్బులన్నీ ఇచ్చేస్తే నాకోసం, నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు కొంత సాయం చేశా. బ్యాలెన్స్ ఉంటే ఫాలోవర్స్ ని అడుగుతున్నా. నా రిక్సెస్ట్‌కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేకధన్యవాదాలు" అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

#social-media #actress-renu-desai #instagram #viral
Advertisment
తాజా కథనాలు