Andhra Pradesh: మీ కంపెనీలను వైజాగ్‌కు తరలించండి..నాస్కామ్‌కు మంత్రి లోకేష్ పిలుపు

కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంతో నిరాశ చెందిన పరిశ్రమలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. కంపెనీలను వైజాగ్‌కు తరలించండి అంటూ నాస్కామ్‌కు పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ అందిస్తామని చెప్పారు.

New Update
Andhra Pradesh: మీ కంపెనీలను వైజాగ్‌కు తరలించండి..నాస్కామ్‌కు మంత్రి లోకేష్ పిలుపు

Minister Lokesh: కర్ణాటకలోని ప్రైవేట్‌ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయా పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌ బిల్లును నిలిపివేసింది. ప్రస్తుతానికి మాత్రమే బిల్లును నిలిపామని..దాన్ని మరొకసారి పరిశీలిస్తామని చెబుతోంది. అయితే ఈ విషయంలో కార్పొరేట్ కంపెనీలు, నాస్కామ్ లాంటివి చాలా నిరాశ చెందాయి. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం వలన టెక్ కంపెనీలు చాలా నష్టపోతాయని నాస్కామ్ అంటోంది.

నాస్కామ్ పెట్టిన పోస్ట్‌కు రిప్లైగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇక్కడు వచ్చేయండి అంటూ ఆఫర్ ఇచ్చారు. మీ కంపెనీలను వైజాగ్‌కు తరలించండి అంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రపరదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎువంటి ఆంక్షలు లేకుడాకపెనీలకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు అందిస్తామని దాంతో పాటూ అత్యంత అనుకూలమైన నైపుణ్యం కలిగిన ప్రతిభ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉందని చెప్పారు. ఐటీ, ఐటీ సేవలు, ఏఐ,డేటా సెంటర్ క్లస్టమర్లకు వ్యాపారాలను విస్తరించడానికి సహాయం చేస్తామని లోకేష్ చెప్పారు.

Also Read:Oman: 13 మందిలో తొమ్మిది మంది సేఫ్

Advertisment
తాజా కథనాలు