AI Technology : చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ

ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే అది ఏఐ. జనాలు దీంతో పిచ్చెక్కిపోతున్నారు. ఈ టెక్నాలజీతో వచ్చిన చాట్‌జీపీటీని అయితే తెగ వాడేస్తున్నారు. అందుకే దీనికి పోటీగా మన దేశం ముద్ర వేయడానికి వచ్చేస్తోంది జియో భారత్ జీపీటీ.

AI Technology : చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ
New Update

Global Tech : ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్(AI) ప్రస్తుతం ప్రపంచాలన్ని ఏలుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం దీన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్టులు చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా బడా కంపెనీలు అన్నీ ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు మన దేశం నుంచి జియో కూడా ఇందులోకి ఎంటర్ అయింది. ఓపెన్ ఏఐ(Open AI) తోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమకంటూ సొంత చాట్ బాట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారి బాటలోనే అడుగులు వేస్తోంది జియో(Reliance Jio) టెలికం. ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏఐ ఆధారిత వ్యవస్థలోకి తన ముద్ర వేయడానికి సిద్ధం అయింది. దీని కోసం ఐఐటీ-బాంబే తో కలిసి ‘భారత్ జీపీటీ’ను డెవలప్ చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ముంబైలో జరిగిన ‘టెక్ ఫెస్ట్’లో ఈ విషయాన్ని తెలిపారు.

Also Read:బాబోయ్ ఇదేం చోద్యం..టీచర్, స్టూడెంట్ రొమాంటిక్ ఫోటో షూట్‌ వైరల్

చాట్ జీపీటీ తరహాలోనే భారత్ జీపీటీ కూడా కృత్రిమ మేధతో పనిచేస్తుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక విస్తృత సమాచార వ్యవస్థను రూపొందించడం భారత్ జీపీటీ లక్ష్యమని చెబుతున్నారు ఆకాశ్ అంబానీ. ఈ భారత్ జీపీటీని "జియో 2.0" అని పిలుస్తున్నారు. ఉత్పత్తులు, సేవలు ఇలా ప్రతి అంశంలో కృత్రిమ మేధ ప్రవేశించబోతోందని ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రతి రంగంలో ఉత్పత్తులు, సేవల్లో పెను మార్పులు తేవొచ్చు. తమ సంస్థలోని అన్ని విభాగాల్లో ఏఐ సేవలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆకాశ్ అంబానీ తెలిపారు. దీంతోపాటు టీవీల కోసం కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తేవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభించామని ఆకాశ్ అంబానీ తెలిపారు. రాబోయే పదేళ్ళను లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జెనరేటివ్ ఏఐ నిర్వచిస్తాయని అభిప్రామం వ్యక్తం చేశారు. మీడియా స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు.

Also Read : కోడికత్తి, బాబాయ్ మర్డర్ సినిమాలు కూడా తీయండి.. ఆర్జీవీకి లోకేష్ సలహా

#ai #bharat-gpt #chatgpt #reliance-jio #jio
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe