Israel-Hamas conflict: బందీలను వెంటనే విడిచిపెట్టేయండి-హమాస్‌కు ఐరాస విజ్ఞప్తి

ఇజ్రాయెల్, మమాస్ మధ్య దాడులు తీవ్ర అవుతున్నాయి. వందల్లో ప్రాణాల్లో పోతున్నా ఇరు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. దీని మీద ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని ఐరాస ఛీఫ్ గుటెరస్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది.

Israel-Hamas conflict: బందీలను వెంటనే విడిచిపెట్టేయండి-హమాస్‌కు ఐరాస విజ్ఞప్తి
New Update

Israel-Hamas Conflict:ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ఐరాస (UN) తీవ్రంగా పరిగణిస్తోంది. వెంటనే ఇరు పక్షాలు దాడులు ఆపాలని విజ్ఞప్తి చేస్తోంది. దారుణమైన పరిస్థితుల్లో నేను రెండు విజ్ఞప్తులను చేయాలనుకుంటున్నాను అని ఐరాస ఛీఫ్ ఆంటోనియా గుటెరస్ (António Guterres) అన్నారు. హమాస్ వెంటనే తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టాలని...ఇజ్రాయెల్ కూడా గాజా వాసులకు సహాయం అందించాలని ఆయన కోరారు. గాజాలో నీరు, ఆహారం,వద్యుత్ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాసకు చెందిన ఆహారం, నరు.ఇతర వస్తువులు, మందులు ఈజిప్ట్, జోర్డాన్, వెస్ట బ్యాంక్, ఇజ్రాయెల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిని కొన్ని గంటల్లో గాజాకు తరలించవచ్చని...ఇజ్రాయెల్ సౌన్యం వీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆయన కోరారు.

అలాగే ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మీద డబ్ల్యూహెచ్వో (WHO) కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. హమాస్ దాడులు అతి క్రూరమైనవని...వాటిని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంది. ఈ దాడుల వల్ల లక్షల మంది ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

మేము రెడీగా ఉన్నాం...

గాజా (Gaza) మీద ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ మరోసారి తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్ల మీద దాడులు వెంటనే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇజ్రాయెల్ మీద చర్యలు తీసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తున్న అమెరికా మీద కూడా మండిపడ్డారు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిర్ అబ్దుల్లాహియన్. యుద్ధాని ఆపాలని, సంక్షోభాన్ని అరికట్టాలని అనుకునేవారు గాజాలో జరుగుతున్న దాడుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్

ఇజ్రాయెల్ దాడుల మీద బైడెన్‌ కామెంట్స్...

ఇజ్రాయెల్‌కు ఎప్పుడూ మద్దతు పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆసక్తికర కామెంట్స్ చేవారు. ఇజ్రాయెల్ బలగాలు ఎక్కువ కాలం గాజాలో ఉండడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అది పెద్ద పొరబాటే అవుతుందని ఆయన అన్నారు. యుద్ధాల్లో అనుసరించాల్సిన నియమాలను ఇజ్రాయెల్ అమలు చేస్తుందని నేను అనుకుంటున్నాని బైడెన్ అన్నారు. గాజా పౌరులకు ఆహారం, నీరు, మందులు అందేటటట్లు చూడాలని ఆయన కోరారు. గాజాను ఇజ్రాయెల్ సొంతం చేసుకోవడం కంటే పాలస్తీనా పాలనలోనే ఉంచడం మంచిదని బైడెన్ వ్యాఖ్యలు చేశారు.

Also Read:హమాస్ తో మాకు ఏమీ సంబంధం లేదు…పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్

#israel #hamas #israel-hamas-conflict
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe