Menstruation: మానసిక ఆరోగ్యం, రుతుస్రావం మధ్య సంబంధం ఏంటి?

రుతుచక్రం సమయంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి ఇవి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అమెనోరియా లాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఇది రుతుస్రావానికి ఆటంకం కలిగిస్తుంది.

New Update
Menstruation: మానసిక ఆరోగ్యం, రుతుస్రావం మధ్య సంబంధం ఏంటి?

Menstruation: రుతుస్రావం, మానసిక ఆరోగ్యం దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. రుతుస్రావం సమయంలో స్త్రీ మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగా ప్రభావితమవుతుంది. మీ రుతుక్రమ తేదీ దగ్గరలో ఉంటే, ప్రీమెన్‌స్ట్రల్‌ సిండ్రోమ్ లక్షణాలు వారం ముందు నుంచే కనిపించే అవకాశం ఉంటాయి. అధిక రక్తస్రావం, బిగుతు రొమ్ములు, తిమ్మిరి, తలనొప్పి, వెన్నునొప్పి, ఉబ్బరం ఇవన్నీ రుతుస్రావం సమయంలో చాలా సాధారణమైన సమస్యలు. అయితే ఇవి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇవి మీ దినచర్యతో పాటు రాత్రి నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి.

ప్రీమెన్‌స్ట్రల్ డైస్ఫోరిక్ డిజార్డర్ అంటే ఏమిటి?:

కొన్నిసార్లు ప్రీమెన్‌స్ట్రల్ డైస్ఫోరిక్ లక్షణాలు చాలా బాధాకరంగా ఉంటాయి. క్షణం కూడా ఉపశమనం ఉండదు. దీన్ని PMD అని కూడా పిలుస్తారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈసారి మానసికంగా చాలా బలహీనంగా ఫీలవుతారు. మీరు ఒకే సమయంలో ఆందోళన, చిరాకు, విచారం, కోపం, మూడ్ స్వింగ్స్, భయాందోళనలను అనుభవించవచ్చు. ఆఫీస్‌ ప్రొడక్టవిటీతో పాటు రోజువారీ పనిలో కూడా బ్రేకులు పడవచ్చు. ఈస్ట్రోజెన్ తగ్గినప్పుడు, సెరోటోనిన్ అనే హార్మోన్ స్థాయిలు కూడా తగ్గడం ప్రారంభిస్తాయి. రుతుస్రావం ముగిసిన తర్వాత ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు అటోమేటిక్‌గా సాధారణ స్థితికి వస్తాయి. రుతుచక్రం సమయంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.

ఆందోళన వద్దు:

రుతుస్రావం గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతుంటే అది క్రమరహిత రుతు చక్రాలకు దారితీస్తుంది. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రుతుక్రమం తగ్గడానికి ఒత్తిడి ప్రధాన కారణం కావచ్చు. విరేచనాలు, పొత్తికడుపులో దీర్ఘకాలిక నొప్పి కూడా ఆందోళన వల్లే కలగవచ్చు. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అమెనోరియా లాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఇది రుతుస్రావానికి ఆటంకం కలిగిస్తుంది.

 ఇది కూడా చదవండి: మంచివారెవరు..ముంచేవారెవరు..గుర్తించడం ఎలా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు