Hyderabad: మరో పదిరోజుల్లో ఆర్ఆర్ఆర్ పరిహారం

రీజినల్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూముల పరిహారం మరో పది రోజుల్లో ఖరారు కానుంది. ఈ భూముల రేట్లను ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం త్వరలోనే వాటిని అందజేయనుంది. సెప్టెంబర్ 15 తరువాత భూపరిహారం రైతులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

Hyderabad: మరో పదిరోజుల్లో ఆర్ఆర్ఆర్ పరిహారం
New Update

Ring Road Land Compensation: హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ను విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రైతుల దగ్గర నుంచి భూములను కూడా సేకరిస్తోంది. ఇప్పుడు వాటి తాలూకా పరిహారాన్ని కూడా మరో పది రోజుల్లో ఖరారు చేయనున్నామని తెలిపింది. ఈ భూముల విలువను గతంలోనే అధికారులు నిర్ణయించారు. వీరికి 2013 భూపరిహార చట్టం కింద డబ్బులను ఇవ్వనున్నారు. రహదారి కోసం భూములను కోల్పోతున్న వారికి పరిహారం గరిష్ఠంగా అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకు సూచించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఈ నెలాఖరులోకా పరిహారాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రాంత రైతులు భూముల అప్పగింత, పరిహారంపై కోర్టులో పిటిషన్లు వేశారు. వారితో చర్చలు జరిపి ఒప్పించాలని జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక 2013 భూపరిహార చట్టం ప్రకారం సవరించిన డబ్బుల వివరాల ముసాయిదాను సెప్టెంబరు15లోగా ఎన్‌హెచ్‌ఏఐకి పంపాలని ప్రభుత్వం గడువు పెట్టింది. దాని తర్వాతనే పరిహారం చెల్లింపుల ప్రక్రియ మొదలవుతుంది. ఈ పరిహారం విషయంలో రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారితో చర్చించి తర్వాతనే ఇస్తారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు సార్లు భూముల రిజిస్ట్రేషన్‌ విలువల్లో సవరణలు చేయడంతో ఆ మేరకు పరిహారం కూడా పెంచింది. ఇప్పుడు 2013 భూపరిహార చట్టం కూడా తోడు కావడంతో గరిష్ఠ పరిహారం అందుతుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌, గెజిట్‌లను సిద్ధం చేస్తున్నారు. 3డీ నోటిఫికేషన్‌కు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 93.10 హెక్టార్లు, మెదక్‌ జిల్లా పరిధిలో 189.13 హెక్డార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 39.79 హెక్టార్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 126.08 హెక్టార్లు పెండింగ్‌లో పడ్డాయి.

Also Read: Nano Car:  నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్..

#telangana #hyderabad #compensation #ring-road
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe