దేశ వ్యాప్తంగా అలెర్ట్ మేసేజ్ లతో ఫోన్లు గోలపెడుతున్నాయి. ఎమర్జెన్సీ అంటూ టెన్షన్ ను పుట్టిస్తున్నాయి. చాలా మంది ఎందుకు ఈ మేసేజ్ వస్తోందో తెలియక తికమక పడుతున్నారు. అయితే ఇందులో టెన్షన్ పడాల్సింది ఏం లేదు అంటోంది కేంద్ర ప్రభుత్వం. భయపడాల్పింది అంతకంటా లేదు అని చెబుతోంది. కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ను డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే టెస్టింగ్ మెసేజ్ లను పంపిస్తున్నారు.
ప్రకృతి విపత్తులు అంటే భూకంపాలు, సునామీలు, హఠాత్తుగా వచ్చే వరదలు, తుఫాన్లు లాంటి వాటి సమాచారాన్ని ప్రజలకు అందించి అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ ను రూపొందించింది. ఇది పని చేస్తోందో లేదో టెస్ట్ చేసేందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఫోన్లకు మెసేజ్ లను పంపిస్తోంది భారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ విభాగం. పెద్ద సౌండ్ తర్వత వాయిస్ తో వచ్చే ఈ మెసేజ్ లు విపత్తులను ప్రజలకు తెలియజేస్తాయి. కేవలం చదువుకోవడమే కాకుండా చదివి వినిపిస్తాయి కూడా.
ఇలాంటి సిస్టమ్ అమెరికా లాంటి దేశాలు ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాయి. భారత్ కూడా ఇప్పుడు మొదలెట్టింది. దీనివల్ల జరిగే నష్టాన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చును. ప్రజలు అలెర్ట్ అవుతారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటారు. స్థానిక అధికారులు సైతం ముందస్తు చర్యలను ఏర్పాటు చేయడానికి వీలు అవుతుంది. అయితే ఇప్పటివరకూ భారత ప్రజలకు ఇది అలవాటు లేదు కాబట్టి ఒక్కసారి ఎమెర్జెన్సీ అలెర్ట్ మెసేజ్ రాగానే ఆందోళనకు గురయ్యారు.
మోబైల్ ఆపరేట్లర్లు, సెల బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థల ఎమెర్జెన్సీ బ్రాడ్ కాస్టింగ్ ను అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని టెలీకమ్యూనికేషన్ శాఖ ఇంతకు ముందే చెప్పింది. దేశ వ్యాప్తంగా దశలవారీగా దీనిని చేపడుతున్నారు. ఆగస్టు, జూలైల్లో కూడా ఇలాంటి మెసేజ్ లను కొంత మంది యూజర్లు రిసీవ్ చేసుకున్నారు.