Andhra Pradesh: ఏపీలో కూటమి గెలుపుకు కారణాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి చేరువలో ఉంది. ఇప్పటికే చాలా ఆధిక్యంలో దూసుకువెళుతున్న కూటమి...ఈసారి అక్కడ గవర్నమెంటు ఏర్పాటు చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి? వైసీపీ ఎందుకు గెలవలేకపోయింది కింది ఆర్టికల్‌లో చూడండి.

New Update
Andhra Pradesh: ఏపీలో కూటమి గెలుపుకు కారణాలు ఇవే..

AP Election Result: ఎన్నికలు జరగడానికి ముందు నుంచీ అసెంబ్లీ తమదే గెలుపు అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చెబుతోంది. ఈసారి ఏపీ ప్రజలు వైసీపీని గెలిపించరని...వైఎస్ జగన్ ప్రభుత్వంతో విసిగిపోయారని చెప్పింది. కూటమి అన్నట్టుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఆంధ్రాలో కూటమి ఆధిక్యంలో దూసుకువెళుతోంది. వైసీపీ ఎక్కడా పోటీ ఇవ్వలేని విధంగా విజయాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ మోస్ట్ క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. ఇంతలా అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవడానికి కారణాలు ఏంటి? ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని వద్దనుకోవడానికి కారణాలు ఇవే.

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 150కు పైగా స్థానాల్లో గెలుపు దిశగా కూటమి ఉంది.

ఏపీలో కూటమి విజయానికి కారణాలు:
2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. దీనికి ప్రధాన కారణం రాజధాని లేకపోవడం. మూడు రాజధానుల పేరుతో.. జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. ప్రజల్లో ఆల్రెడీ ఉన్న అసంతృప్తిని టీడీపీ బాగానే క్యాష్ చేసుకుంది. ఐదేళ్ళల్లో రాజధానిని నిర్ణయించలేకపోవడం...అక్కడా...ఇక్కడా అంటూ కాలక్షేపం చేయడం ఆంధ్ర ప్రజలు తట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఆ ఫలితమే ఇప్పుడు వైసీపీ ఓటమికి కారణం అయింది.

వైసీపీ ఓటమికి మరో పెద్ద కారణం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగకపోవడం. రాష్ట్రంలో యువత ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉంది. దీన్ని అదనుగా తీసుకున్న టీడీపీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మళ్లీ కంపెనీలు వస్తాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయన్న ప్రచారం బలంగా చేసింది. ఇది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతలో బలంగా పని చేసింది. దీంతో వారి ఓట్లన్నీ కూటమికి వెళ్ళిపోయాయి.

వీటితో పాటూ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం ఒక్కటే తప్పా.. అభివృద్ధి జరగడం లేదని కూటమి సబ్యులు బాగా ప్రచారం చేశారు. ఎక్కడిక్కడ రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలకు ఉదాహరణలుగా చూపిస్తూ ప్రచారం నిర్వహించారు.

ఇక సోషల్ మీడియాను కూడా టీడీపీ బాగా వాడుకుంది. ప్రతి పక్షంలో ఉంటూ వైసీపీ లోపాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కూటమి సక్సెస్ అయింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ...టీడీపీ వస్తే ఏం చేస్తుందో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇది కూడా కూటమి విజయానికి దారి తీసింది. ఇక చివరలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో లోపాలను అస్త్రంగా మార్చుకుని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా టీడీపీ సక్సెస్ అయింది. దాంతో పాటూ వ్యూహాత్యకంగా ఎన్డీఏ కూటమిలో చేరడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న మోదీ గాలి కలిసిరావడం..పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్, క్లీన్ ఇమేజ్ కలిసి రావడం లాంటివి కూడా ఏపీలో కూటమికి విజయం దక్కేలా చేశాయి.

Advertisment
తాజా కథనాలు