Telangana: లాస్య నందిత మృతికి మూడు కారణాలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైనది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు.

Telangana: లాస్య నందిత మృతికి మూడు కారణాలు..
New Update

Three Reasons Behind MLA Lasya Nadita Death: రోడ్డు ప్రమాదాలు చాలా డేంజరస్‌గా తయారవుతున్నాయి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతున్నారో తెలుసుకోవడం కూడా చాలా కష్టమైపోతున్నాది. నిన్న కళ్ళ ముందు కనిపించిన వారు ఈరోజు ఉండటం లేదు. తాజాగా ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం మాటల్లేకుండా చేసింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్నXL6 కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదానికి మూడు కారణాలు..

లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. మొదటిది సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న మారుతి సుజుకీ XL 6 కారులో ప్రయాణం ఒక కారణం. దీని తరువాత లాస్య నందిత సీటు బెల్టు వేసుకోకపోవడం మరో కారణం. మిడిల్ లేదా వెనుక సీటులో కూర్చున్నవారు సీటు బెట్ల్ వేసుకోనక్కర్లేదనే భ్రమలో ఉంటారు. ముందు కూర్చున్న వాళ్ళకే ప్రమాదం జరుగుతుంది...వెనుక ఉంటే ఏమీ అవదనే అనుకుంటారు. అందుకే దాదాపు 90 శాతం మంది వెనుక సీటు లేదా మిడిల్ సీటులో కూర్చున్న వారు సీటు బెల్ట్ వేసుకోరు. కానీ ఇప్పుడు మధ్య సీటులో కూర్చున్న లాస్య సీటు బెల్ట్ వేసుకోని కారణంగా ప్రమాదం జరిగినప్పుడు ఆమె ముందు సీటుకు వెళ్ళి బలంగా ఢీకొన్నారు. దీంతో ఆమె తలలోని ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించారు. ఇక మూడో కారణం నిద్రమత్తు. లాస్య కారును నడుపుతున్న ఆమె పీఏ నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఇతనే స్కార్పియో కారును నడిపినప్పుడే ఒక ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు లాస్ ఆ ప్రమాదంలో చిన్న గాయాలతో బయటపడి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే డ్రైవర్ డ్రైవింగ్‌లో ప్రాణాలను పోగొట్టుకున్నారు.

దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది తిరిగేసరికి మళ్ళీ అదే ఫిబ్రవరిలో లాస్య ప్రమాదంలో మరణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

#brs #accident #mla #death #lasya-nanditha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe