/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sabitha-jpg.webp)
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్‌లో ఆయన తనకు తానే కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ నేపథ్యంలో డీసీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 'ఏఆర్‌ఎస్‌ఐ ఫజిల్ ఈరోజు ఉదయం 6 గంటలకు గన్‌తో కాల్చుకొని ఆత్యహత్యకు పాల్పడ్డారు. ఎస్కార్ట్ డ్యూటి ఉన్న క్రమంలో ఉదయం 6 గంటలకు రిలేవర్‌కు రిలీవింగ్ ఇచ్చారు. హోటల్ వద్ద తన కూతురుతో మాట్లాడి గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యలే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యలు ఈ ఘటనపై కేసులు పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని ' డీసీపీ జోయేల్ డేవిస్ తెలిపారు.
Also Read: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్? జాబితాలో 17 మంది పేర్లు.. పలువురి పేర్లు మిస్సింగ్!