IPL: RCB పేరు మార్పు.. ఈసారైనా అదృష్టం వరించేనా!?

ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మారింది. 'Royal Challengers Bangalore' కు బదులు 'Royal Challengers Bengaluru'గా మార్చేశారు. అధికారిక పోస్ట్ వైరల్ అవుతుండగా.. పేరు మారింది రాత మారేనా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
IPL: RCB పేరు మార్పు.. ఈసారైనా అదృష్టం వరించేనా!?

RCB Unbox Event 2024:  ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మార్చుకుంది. 'Royal Challengers Bangalore' కు బదులు 'Royal Challengers Bengaluru' గా మార్చేశారు. మరో మూడు రోజుల్లో 2024 మెగా ఈవెంట్ మొదలు కానుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మార్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో పేరు మార్చుకుని ఆర్సీబీ బరిలోకి దిగబోతున్నట్లు తెలిపింది.

ఉత్కంఠకు తెర..
ఇక ఈ పేరు మార్పుపై కొంతకాలంగా చర్చ నడుస్తుండగా.. ఆర్సీబీ ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ఆ వీడియోలో ప్రముఖ హీరోయిన్‌ రష్మికా మంధాన కనిపిస్తూ.. క్యారవాన్‌లోకి ఎక్కి అద్దంపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అని రాసి ఉంటే అందులో బెంగళూరు అనే పదాన్ని నోటితో ఊది చెరిపేసింది. బెంగళూరు అనే పదం తొలగిస్తున్నారా? లేక అసలు పూర్తిగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేరును మార్చేసి.. కొత్త పేరుతో బరిలోకి దిగుతున్నారా? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవగా మొత్తానికి ఉత్కంఠకు ఈ రోజు తెరపడింది.

16 సీజన్లుగా నిరీక్షణ..
ఇదిలావుంటే.. అబ్బాయిలు సాధించలేనిది అమ్మాయిలు సాధించారు. విమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ విజేతగా బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ టీమ్‌ ఆవిర్భవించింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మరో 3 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది. ఇది బెంగళూరుకు తొలి WPL టైటిల్‌. ఇక గతేడాది నుంచే WPL స్టార్ట్‌ అవగా 2023లో ముంబై విజేతగా నిలిచింది. బెంగళూరు లాస్ట్‌ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మాత్రం బెంగళూరు సత్తా చాటింది. ఏకంగా ట్రోఫిని ఎగరేసుకుపోయింది. పురుషుల ఐపీఎల్‌లో అబ్బాయిలు ఇప్పటివరకు కప్‌ కొట్టలేకపోయారు. 2008లో ఐపీఎల్‌ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. 16 సీజన్లగా బెంగళూరుకు కప్‌ లేదు. అయితే మహిళలు మాత్రం రెండో సీజన్‌లో ట్రోఫిని గెలుచుకోవడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు