Elur: సీఎం ప్యాలెస్, ఎమ్మెల్యేలు గెస్ట్ హౌస్ ల్లో కాలక్షేపం చేస్తున్నారు.. అరుణ సంచలన వ్యాఖ్యలు ఏపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు గెస్ట్ హౌస్ ల్లో గడుపుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ లో కాలక్షేపం చేస్తున్నాడని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ విమర్శించారు. నూజివీడులో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి 50వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 26 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి AP: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని నేడు ప్రారంభించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ,నూజివీడు టిడిపి ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జనసేన సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారీ బైక్ ర్యాలీ.. ఈ సందర్భంగా జనసైనికులు స్థానిక ట్రిపుల్ ఐటీ దగ్గరి నుంచి రాజీవ్ సర్కిల్ వరకు ఆ తర్వాత పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీతో తరలివచ్చారు. మొదట డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి, జాతిపిత మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు,వంగవీటి మోహనరంగా,దివంగత జనసేన పార్టీ నాయకులు బసవ భాస్కరరావు, బర్మా ఫణి బాబు,జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు. విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అఖండ విజయం మాదే.. ఈ క్రమంలో మాట్లాడిన జనసేన నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు.. నూజివీడులో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి 50 వేల ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా.. రెండు పార్టీలు సమన్వయంతో పనిచేసే అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్యాలెస్ లో.. అనంతరం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మంత్రులు గెస్ట్ హౌసుల్లో గడుపుతుంటే, ముఖ్యమంత్రి ప్యాలెస్ లలో కాలక్షేపం చేస్తున్నాడని విమర్శించారు. 'నూజివీడులో రహదారులపై ద్వాజమెత్తిన ఆమె నూజివీడులో రహదారులు ఉన్నంత దరిద్రంగా రాష్ట్రంలో ఎక్కడ లేవు ఎమ్మెల్యే గారు. మీరు రోడ్లపై తిరుగుతున్నారో,లేక మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఆకాశంలో తిరుగుతున్నారో అర్థం కావడం లేదు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో గెలుస్తానని అంటున్నారు. నూజివీడు విషయానికి వస్తే రోడ్లపై ఉన్న గుంతకు ఒక ఓటు చొప్పున కూడా వస్తాయో లేదో చూసుకోవాలి' అంటూ చురకలంటించారు. ఇది కూడా చదవండి : Tripti: ఇలా జరుగుతుందని అసలే ఊహించలేదు.. ఇక పాఠం నేర్చుకోవాలి: త్రిప్తి డిమ్రి ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్,గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి, రమేష్, రాష్ట్ర నాయకులు గరికిపాటి శివశంకర్,నేరుసు కృష్ణాంజనేయులు, ఏనుగుల వెంకటేశ్వరరావు, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్,తదితరులు పాల్గొన్నారు. #ycp #jagan #janasena #rayapati-aruna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి