Ration Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్!?

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పేద, మధ్య తరగతి బాధలను తీర్చేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.

New Update
Ration Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్!?

Telangana : కొత్త రేషన్ కార్డులు (New Ration Card) ఎప్పుడొస్తాయా అని అతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas) శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ (Election Code) ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ఎక్స్(ట్విట్టర్‌) వేదికగా ప్రకటిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రేషన్ కార్డులు మాత్రం రాలేదు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. గత బీఆర్ఎస్ (BRS)​ ప్రభుత్వం రేషన్​ కార్డులు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేసింది. సంక్షేమ పథకాలు అందుకునే వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ రేషన్ కార్డు ఉంటేనే పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీలకు అర్హులు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేయడానికి ముందుకొచ్చింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ మొదలుపెడతాం. రేషన్ కార్డులు లేక పేద, మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు.

Also Read : ఎన్నికల ముందు ఒడిశాలో ఈసీ సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు