Telangana : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఈ కసరత్తులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

New Update
Telangana : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..

New Ration Cards : తెలంగాణ (Telangana) లో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ (Election Code) ముగిశాక ఈ కసరత్తులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆరోగ్య శ్రీ కార్డులతో గతంలో రూ.5 లక్షలు చికిత్స పరిమితి ఉండగా.. కాంగ్రెస్ సర్కార్ దాన్ని రూ.10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాత ఆరోగ్యశ్రీ కార్డుల (Arogyasri Cards) స్థానంలో కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.

Also read: ఐఐటీహెచ్‌లో అడ్మిషన్లకు సీఎం రేవంత్ ఆమోదం

ఇక రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే 89,98,546 రేషన్ కార్డు కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు (Ration Card) చిన్న పుస్తకం లాగా ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతో సహా.. కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా, వయసు తదితర వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటి స్థానంలో రైతుబంధు లాంటి పాక్‌బుక్‌ సైజ్‌లో రేషన్‌ కార్డులు వచ్చాయి, ముందువైపు కుటుంబసభ్యుల గ్రూప్‌ ఫొటో.. దాని కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. వెనకవైపు కార్డు నెంబర్, చిరునామా తదితర వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్‌ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు ఉచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల ఫొటోలు లేకుండా.. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. అయితే మళ్లీ ఇప్పుడు ఈ కార్డులు కూడా మారనున్నాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత వీటి రూపం ఎలా ఉండాలనే విషయంపై రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకోనుంది.

Also Read: జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు!

Advertisment
తాజా కథనాలు