ఆ ఒక్క మాటే గుర్తుంది..
ఈ మేరకు 'యానిమల్' కోసం రణ్‌బీర్ కపూర్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పింది. 'మొదట్లో డైరెక్టర్ సందీప్ వంగా ఆలోచనా విధానం చూసి షాక్ అయ్యాను. రణ్‌బీర్‌ను చెంపపై కొట్టే సన్నివేశం నిజంగా నాకొక సవాల్ గా అనిపించింది. సందీప్ సీన్‌ను వివరించి పరిస్థితిని రియల్ గా ఫీల్ కావాలని చెప్పారు. ఒక్క టేక్‌లోనే ఆ సన్నీవేశం మొత్తం షూట్ చేశాం. కానీ యాక్షన్, కట్ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. కేవలం డైరెక్టర్ చెప్పిన ఆ ఒక్క మాటే గుర్తుంది' అని చెప్పింది.
ఇది కూడా చదవండి : JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
రణ్‌బీర్ మీద కేకలు..
అలాగే ఈ సన్నివేశంలో రణ్‌బీర్ మీద కేకలు వేయడం, కోపంతో అతడిని చెంపపై కొట్టడం బాధ కలిగించిందని తెలిపింది. 'షాట్ ఓకే అని దర్శకుడు చెప్పినా నా కన్నీళ్లు ఆగలేదు. బాగా ఏడ్చేశా. తర్వాత రణ్‌బీర్ వద్దకువెళ్లి ‘అంతా ఓకేనా’ అని అడిగా. ‘యానిమల్’ సీక్వెల్ విషయంలో సందీప్ ఎంతో క్లారిటీతో ఉన్నారు. పార్ట్ 1కు వచ్చిన స్పందన దృష్టిలో ఉంచుకుని తను అనుకున్నది స్క్రీన్‌పైకి తీసుకువస్తారు. తప్పకుండా రెండో పార్ట్ కూడా ఘన విజయం సాధిస్తుంది' అంటూ హ్యాపీగా ఫీల్ అయింది.
ఒకే ఒక్క మాట..
ఈ క్రమంలోనే మరో అప్ కమింగ్ మూవీ ‘పుష్ప 2’ గురించి మాట్లాడుతూ.. 'నేను ఒకే ఒక్క మాట చెబుతున్నా.. అందరూ ఊహించినదానికంటే పది రేట్లు పుష్ప2 అలరిస్తుంది. ‘పుష్ప ది రైజ్’ సక్సెస్‌తో మాపై బాధ్యత కూడా పెరిగింది. ఇటీవలే ఒక పాట షూట్ కంప్లీట్ చేశాం. నిజానికి ఇది ముగింపు లేని కథ. మనం అనుకున్నట్లు దీనిని తీర్చిదిద్దవచ్చు. ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు' అని చెప్పింది. దీంతోపాటు తాను శేఖర్ కమ్ముల - ధనుష్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది రష్మిక.