Rashmika: ఆ ఒక్కమాటతో రణబీర్ చెంప పగలగొట్టేశా స్టార్ నటి రష్మిక మందన్నా 'యానిమల్'మూవీలో రణ్ బీర్ చెంప పగలగొట్టిన సీన్ గురించి ఓపెన్ అయింది. 'అతన్ని చెంపపై కొట్టడం నిజంగా సవాల్ గా ఫీల్ అయ్యాను. కానీ డైరెక్టర్ ఆ సీన్ ను నిజంగా ఫీల్ కావాలని చెప్పారు. ఆ ఒక్కమాటతో ఒకే టేక్ లో సీన్ కంప్లీట్ చేశా'అని తెలిపింది. By srinivas 19 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ‘యానిమల్’ (Animal Movie)తో బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రణ్ బీర్ (Ranbir) హీరోగా సందీప్ వంగా (Sandeep Vanga) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ మూవీ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తున్న రష్మిక.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సమావేశంలో యానిమల్ లోని పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ గురించి ఓపెన్ అయింది. Wishing my darling loves all the happiness, joy and goodness 🫶🏻🤍 मकर संक्रांति 🧡 பொங்கல்🧡 మకర సంక్రాంతి🧡 ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ 🧡 പൊങ്കല്🧡 ਲੋਹੜੀ 🧡 pic.twitter.com/NI8OnAXDDc — Rashmika Mandanna (@iamRashmika) January 15, 2024 ఆ ఒక్క మాటే గుర్తుంది.. ఈ మేరకు 'యానిమల్' కోసం రణ్‌బీర్ కపూర్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పింది. 'మొదట్లో డైరెక్టర్ సందీప్ వంగా ఆలోచనా విధానం చూసి షాక్ అయ్యాను. రణ్‌బీర్‌ను చెంపపై కొట్టే సన్నివేశం నిజంగా నాకొక సవాల్ గా అనిపించింది. సందీప్ సీన్‌ను వివరించి పరిస్థితిని రియల్ గా ఫీల్ కావాలని చెప్పారు. ఒక్క టేక్‌లోనే ఆ సన్నీవేశం మొత్తం షూట్ చేశాం. కానీ యాక్షన్, కట్ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. కేవలం డైరెక్టర్ చెప్పిన ఆ ఒక్క మాటే గుర్తుంది' అని చెప్పింది. ఇది కూడా చదవండి : JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రణ్‌బీర్ మీద కేకలు.. అలాగే ఈ సన్నివేశంలో రణ్‌బీర్ మీద కేకలు వేయడం, కోపంతో అతడిని చెంపపై కొట్టడం బాధ కలిగించిందని తెలిపింది. 'షాట్ ఓకే అని దర్శకుడు చెప్పినా నా కన్నీళ్లు ఆగలేదు. బాగా ఏడ్చేశా. తర్వాత రణ్‌బీర్ వద్దకువెళ్లి ‘అంతా ఓకేనా’ అని అడిగా. ‘యానిమల్’ సీక్వెల్ విషయంలో సందీప్ ఎంతో క్లారిటీతో ఉన్నారు. పార్ట్ 1కు వచ్చిన స్పందన దృష్టిలో ఉంచుకుని తను అనుకున్నది స్క్రీన్‌పైకి తీసుకువస్తారు. తప్పకుండా రెండో పార్ట్ కూడా ఘన విజయం సాధిస్తుంది' అంటూ హ్యాపీగా ఫీల్ అయింది. ఒకే ఒక్క మాట.. ఈ క్రమంలోనే మరో అప్ కమింగ్ మూవీ ‘పుష్ప 2’ గురించి మాట్లాడుతూ.. 'నేను ఒకే ఒక్క మాట చెబుతున్నా.. అందరూ ఊహించినదానికంటే పది రేట్లు పుష్ప2 అలరిస్తుంది. ‘పుష్ప ది రైజ్’ సక్సెస్‌తో మాపై బాధ్యత కూడా పెరిగింది. ఇటీవలే ఒక పాట షూట్ కంప్లీట్ చేశాం. నిజానికి ఇది ముగింపు లేని కథ. మనం అనుకున్నట్లు దీనిని తీర్చిదిద్దవచ్చు. ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు' అని చెప్పింది. దీంతోపాటు తాను శేఖర్ కమ్ముల - ధనుష్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది రష్మిక. #slapped #ranbeer #rashmika #animal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి