Patanjali Excuses : ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి యాడ్స్(Patanjali Ads) కేసులో ఆ సంస్థపై నిన్న సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన ప్రకటన సైజ్‌లోనే క్షమాపణల ప్రకటనలు కూడా ఉంటాయని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఆ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. సైజు విషయంలో సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. నిన్నటి రోజుతో పోలిస్తే ఈసారి పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారు. వీళ్లు ఇలా న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం ఇది రెండోసారి.
Also Read: వాళ్ల కోసం ప్రధాని మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు: రాహుల్
ప్రజలను తప్పుదారి పట్టించే యాడ్స్ సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ న్యూస్ పేపర్లలో ప్రకటను ఇచ్చామని పతంజలి సంస్థ నిన్న సుప్రీంకోర్టుకు చెప్పింది. ఆ సంస్థ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా మొత్తం 67 పత్రికల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇచ్చామని చెప్పారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. క్షమాపణ ప్రకటనను గతంలో మీ ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్ సైజునే వాడారా.. ఆ సైజ్‌లోనే ప్రచూరించిరా అంటూ ప్రశ్నించింది.
Also Read: లైవ్‌లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్
దీనికి రోహాత్గీ బదులిస్తూ బహిరంగ క్షమాపణలను మరోసారి పెద్ద సైజ్‌లో ప్రచూరిస్తామని చెప్పారు. దీంతో ఈరోజు మరోసారి న్యూస్ పేపర్లలో పతంజలి సంస్థ పెద్ద సైజ్‌లో క్షమాపణల ప్రకటనను ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఆరోజే పతంజలి కోర్టు ధిక్కార అంశాన్ని విచారిస్తామని పేర్కొంది. అలాగే న్యూస్ పేపర్ల(News Papers) లో వచ్చిన బహిరంగ క్షమాపణ ప్రకటన వివరాలు కూడా రెండు రోజుల్లోగా సమర్పించాలని.. వాటి ప్రతులను పిటిషినర్లకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.