/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-21.jpg)
Double ISmart Trailer : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' (Double ISmart). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ (Cinema Trailer) రిలీజ్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆగస్టు 4న ట్రైలర్
'డబుల్ ఇస్మార్ట్' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఆగస్టు 4న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'శంకర్ గాడి మెంటల్ మాస్ కి రెడీ అయిపోండి' అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రామ్ మరోసారి మాస్ అండ్ యాంగ్రీ లుక్ తో ఆకట్టుకున్నాడు. రామ్ హై వోల్టేజ్ యాక్షన్ , పూరీ మార్క్ మాస్ పంచ్ డైలాగ్స్, మణిశర్మ నెక్స్ట్ లెవెల్ బీజీయం కలబోతగా ట్రైలర్ ఉటుందని టాక్ వినిపిస్తుంది.
Maama... Shankar gadi MENTAL MASS ki ready aipondi 🤙
The explosive #DoubleiSmartTrailer On AUGUST 4th 💥💥
Brace yourselves for Explosive Action & High Octane Energy🔥#DoubleiSmart #DoubleIsmartOnAug15
Ustaad @ramsayz @KavyaThapar #PuriJagannadh @Charmmeofficial @duttsanjay… pic.twitter.com/EWxrpW5uUV
— Puri Connects (@PuriConnects) July 31, 2024
Also Read : ఓవర్సీస్ లో కొనసాగుతున్న ‘కల్కి’ హవా.. ప్రభాస్ దెబ్బకు షారుక్ రికార్డ్ గల్లంతు..!
కాగా ఆగస్టు 4 న మేకర్స్ ట్రైలర్‌తో పాటు మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం.కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. బాని జె, అలీ, గెటప్ శ్రీను, సయ్యజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చార్మీ కౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.