Ram Pothineni: దుమ్మురేపుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ట్రైలర్.. రామ్ చిచ్చ రచ్చ రచ్చ!

రామ్ పోతినేని అప్ కమింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పటిలాగే ఊరమాస్ యాంగిల్, డైలాగ్స్ తో రామ్ అదరగొట్టేశాడు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

New Update
Ram Pothineni: దుమ్మురేపుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ట్రైలర్.. రామ్ చిచ్చ రచ్చ రచ్చ!

Double ISMART: పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వస్తున్న మరో మాస్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. పాన్‌ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా రాబోతున్న సినిమాలో రామ్ ఊరమాస్ యాంగిల్ లో దుమ్ము రేపారు. ఎప్పటిలాగే ఉస్తాద్ రామ్ అంటూ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది.

ఇప్పటికే పూరీ టీం రిలీజ్ చేసిన ధిమాక్కిరికిరి డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్‌ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్‌. డబుల్‌ ఇస్మార్ట్‌ స్టైల్‌లో సాగుతున్న ట్రైలర్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి పనిచేస్తుండటంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకుంది. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌ గా నటించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు