RGV Tweet : జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. నిన్న విశాఖలో ఏర్పాటు చేసిన జనసేన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అమెరికా చరిత్రలో నిలిచిపోయిన మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కూడా అనేక ఎన్నికల్లో ఓడిపోయారంటూ ప్రస్తావన తెచ్చారు. లింకన్ న్యాయవాద ఎన్నికల్లో ఓడిపోయారు, సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయారు, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయారు అని పవన్ వివరించారు. అయితే, పవన్ వ్యాఖ్యాలపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సెటైరికల్ ట్విట్ చేశారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్విట్.!
మీ ఓటమిని సమర్థించుకోవడానికి మీరు అబ్రహాం లింకన్ ప్రస్తావన తీసుకురావడం సమంజసంగా లేదన్నారు. మీలాగే లింకన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పే ప్రయత్నం ఏమాత్రం అతకలేదని కామెంట్స్ చేశారు. మీకు, అబ్రహాం లింకన్ కు సారూప్యత అనేదే లేదన్నారు. ఎందుకంటే.. లింకన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయే నాటికి ఆయన గురించి ఎవరికీ తెలియదని.. అప్పటికి ఆయన ఓ సామాన్యమైన వ్యక్తి మాత్రమేనని.. కానీ మీరు ఎన్నికల్లో పాల్గొన్న నాటికి సినిమాల్లో మీరొక సూపర్ స్టార్ అని.. మీ గురించి అందరికీ తెలుసు... కానీ, ఓడిపోయారు.. అదీ మీకు, లింకన్ కు ఉన్న తేడా అని వర్మ వివరించారు.